27.7 C
Hyderabad
May 4, 2024 07: 16 AM
Slider వరంగల్

131 జీఓను రద్దు చేయాలని బిజెపి ఆందోళన

#BJPPalakurthy

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తీసుకోచ్చిన 131 జీఓను ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని బీజేపీ నాయకులు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు.

అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) తో ప్రజలపై భారం మోపడం సరైందికాదన్నారు.

ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131 జీఓతో మద్య,తరగతి ప్రజలు నష్టపోతారని అన్నారు.

కరోనా సమయంలో ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎల్ఆర్ఎస్ తేవడం ప్రజలను మరింత ఆర్ధికంగా నడ్డి విరుచేందుకేనని విమర్శించారు.

ప్రభుత్వం ప్రజల ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎల్ఆర్ఎస్ వెంటనే రద్ధు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలను ఏకం చేసి ఉద్యమంను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దొంగరి మహేందర్, మండల అధ్యక్షులు కమ్మగాని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ శివార్లలో విరగకాస్తున్న రుద్రాక్ష పంట

Satyam NEWS

ఏపిలో విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్ విడుదల

Satyam NEWS

స్థానిక సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాలు

Satyam NEWS

Leave a Comment