27.7 C
Hyderabad
May 17, 2024 22: 45 PM
Slider ముఖ్యంశాలు

సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ సారధ్యంలో మత సామరస్య కమిటీ

#AditynathDas

దేవాలయాలపై వరుస దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు పునరావృతంగా కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో మత సామరస్య కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎస్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కలెక్టర్ల అధ్యక్షతన ఆరుగురితో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎస్ తెలిపారు. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి   చైర్మన్ గా సీఎస్, వైస్ ఛైర్మన్ గా డీజీపీ వ్యవహరిస్తారు.

కమిటీలో హోం, దేవాదాయ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు.

కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. కమిటీలు మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తాయి. ఈ కమిటీలకు ఎలాంటి కాల పరిమితి లేదు.

మత సామరస్యం దెబ్బతీసేందుకు పథకం ప్రకారం కుట్ర

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు, మత సామరస్యం దెబ్బతీసేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని సీఎస్ ఆదిత్య నాద్ దాస్ ఆరోపించారు. సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

సీఎస్ మాట్లాడుతూ ప్రజాసేవలో ఉన్నవారికి మతం ఆపాదించడం సరికాదన్నారు. వరుస ఘటనల వెనుక లోతైన కుట్ర ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోందన్నారు. వరుసగా జరుగుతున్న ఘటనల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుంది. మత సామరస్యం దెబ్బతినేలా చేస్తున్న పరిస్థితులు ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నారు.

అందుకే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు  ఏర్పాటు చేస్తూ జీఓ నెంబర్ 6 విడుదల చేశామన్నారు. ఇలాంటి వాటిని చేధించాలంటే అధికారులు పోలీసులు, మత పెద్దలు అందరికి బాధ్యత ఉండాలన్నారు. ఈ తరహా నేరాలు జరిగినప్పుడు అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు తప్పించుకుంటున్నారన్నారు.

అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎస్ హెచ్చరించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసుశాఖ తనవంతు ప్రయత్నం చేస్తోందని చెప్పారు. 

మత సామరస్యం కాపాడేందుకు అందరూ ముందుకురావాలని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ కోరారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే కమిటీలు ఏర్పాటు చేసినట్లు సీఎస్ వెల్లడించారు. ఈ కమిటీలు రాష్ట్రంలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తాయని సీఎస్‌ చెప్పారు.

Related posts

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

ఓట్లు వేయించుకున్న వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు… మేం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం

Satyam NEWS

డోర్నకల్ మిర్యాలగూడ మధ్య రైల్వే ప్రాజెక్ట్

Murali Krishna

Leave a Comment