31.7 C
Hyderabad
May 7, 2024 02: 30 AM
Slider ఆంధ్రప్రదేశ్

సిఎంపై అనుచిత పోస్టింగులు చేసిన అధికారి అరెస్టు

#Andhra Pradesh CM

ముఖ్యమంత్రిపై అనుచితమైన పోస్టింగులు చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఎపి స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఎం.వి.విద్యాసాగర్ తన మొబైల్ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విషయాలను పోస్ట్ చేశారు.

దాంతో ఎపి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి, సిఐడి చీఫ్ పి.వి. సునీల్‌కుమార్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ‌ చేశారు. దుష్ప్రవర్తన,  క్రమశిక్షణ,  సెక్షన్ 25 ను ఉల్లంఘించినందుకు  సస్పెండ్ చేసినట్లు ఆయన ఒక ప్రకటన లో తెలిపారు. డిఇఇ విద్యాసాగర్ సిఎంను అసభ్య భాషలో దూషిస్తూ,  ఎపి ప్రభుత్వ విధానాలను తన వాట్సాప్ గ్రూపులలో విమర్శించారని ఏపి సిఐడి‌ చీఫ్ సునీల్ కుమార్  తెలిపారు.

విచారణ లో ఆధారాలతో సహా అన్నీ వాస్తవం అని తేలాయని అందుకే సస్పెండ్ చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. అతిక్రమిస్తే  AP ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలను తీసుకుంటాం అని ఆయన తెలిపారు.

Related posts

రోడ్లు ఊడ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS

టీడీపీ నేతల అద్వర్యంలో కరోనా నివారణకు ఆనందయ్య మందు పంపిణీ

Satyam NEWS

మతవాద  పార్టీ లను గ్రామాలకు రానివ్వొద్దు

Murali Krishna

Leave a Comment