27.2 C
Hyderabad
May 18, 2024 19: 02 PM
Slider మహబూబ్ నగర్

ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోని కల్వకుర్తి పోలీసులు

#kalwakurthypolice

కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో ప్రజలు ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కొన్ని రోజుల కిందట సత్యంన్యూస్ లో వచ్చిన కథనానికి స్పందించిన పోలీసులు ఉదయం 9 గంటల లోపు దిగుమతి చేసుకోవాలని హమాలీలను వ్యాపారస్తులను హెచ్చరించారు. అయినా నేటికీ  రోజులో ఎప్పుడు పడితే అప్పుడు  దిగుమతులు చేస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నా కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

బడా బడా వ్యాపారులు రోడ్లపైనే చిరు వ్యాపారుల దుకాణాల ముందు పెద్దపెద్ద వాహనాలను నిలిపి వారి జీరో వ్యాపారాన్ని కొనసాగిస్తూ చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారు. పోలీసులు ఫిర్యాదు దారులు ఇచ్చిన ఫిర్యాదులకు స్పందించడం లేదని జిల్లా స్థాయి పోలీసు అధికారిని సంప్రదించిన న్యాయం జరగడంలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏదో ఒక కేసులో విచారణ చేపట్టిన ఆ కేసును తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసువారికి భయపడి కూడా ఏమీ చేయలేక పోతున్నట్లు ఫిర్యాదుదారుడు విసుగుచెంది కన్నీరు మున్నీరవుతున్నారు.

వంద నెంబర్ కు వంద సార్లు డయల్  చేసిన కలక పోవడంతో పట్టణవాసులు ఖంగు తింటున్నారు. పట్టణంలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు అవసరమని ప్రజలను చైతన్యం చేయడం తో పాటు దాతల సహకారంతో ముఖ్య కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో తెలియని పరిస్థితి ఇటీవల కల్వకుర్తి ప్రాంతంలో జరిగిన దొంగతనాలు సంచలనం రేపాయి

దుకాణాల సెటర్లు లేపి చోరీ చేసిన దొంగలను ఇప్పటివరకు పోలీసులు గుర్తించ లేదంటే వారి పనితీరు అద్దం పడుతుంది. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు చాలా వరకు చోరీ గురవుతున్న పట్టించుకునే నాథుడే లేడు. పోలీసులకు సివిల్ పంచాయతీలు ముఖ్యం అన్న రీతిలో వ్యవహారం నడుస్తుందని విమర్శలు పట్టణంలో కోడై కూస్తున్నాయి కల్వకుర్తి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఎకరా భూమి కోట్ల రూపాయల ధర పలుకుతోంది రియల్ వ్యాపారం లో సమస్యలు తలెత్తినప్పుడు ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయిస్తున్న ట్లు తెలుస్తుంది

దీంతో పోలీసులు వారి పంచాయతీలు తెంపుతూ శాంతిభద్రతల పరిరక్షణ గాలికి వదిలేస్తుడటంతో పట్టణ వాసులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. సంవత్సరాలు గడుస్తున్న బదిలీలు లేక అధికారులు పాతుకుపోయి ఇష్టానుసారంగా అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే  స్టేషన్ కు ఎవరెవరు వస్తున్నారో పరిశీలించవచ్చు. ఇప్పటికైనా పట్టణంలో ట్రాఫిక్ సమస్య దొంగతనాల సమస్య ఇతర సమస్యలపై పోలీసులు దృష్టి సారించి సామాన్యులకు రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

సుప్రీంకు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన ప్రశాంత్ భూషణ్

Satyam NEWS

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని కలిసిన ఐ ఏ ఎస్,ఐ ఆర్ ఎస్ బృందం

Satyam NEWS

బివేర్: రహేజా మైండ్ స్పేస్ లో కరోనా కలకలం

Satyam NEWS

Leave a Comment