37.2 C
Hyderabad
May 2, 2024 11: 08 AM
Slider ముఖ్యంశాలు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని కలిసిన ఐ ఏ ఎస్,ఐ ఆర్ ఎస్ బృందం

#venkaiahnaidu

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును గురువారం ఐపిఎస్,ఐఏఎస్ బృందం సభ్యులు ఉపరాష్ట్రపతి భవన్లో కలిశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఐఆర్ఎస్ పిన్నని సందీప్ బాగా నాయకత్వంలో ఉపరాష్ట్రపతిని కలిసి పలు అంశాలపై చర్చించారు. తెలుగు భాషా సంస్కృతి సాంప్రదాయాలపై జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు గౌరవం లభించేలా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సూచించినట్లు తెలిపారు. దేశంలోని అనేక ప్రాంతీయ భాషల్లోనూ తెలుగు భాష గొప్పదనాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు తెలియ చెప్పాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ చారిత్రాత్మక నేపథ్యాన్ని,చరిత్రను ఉపరాష్ట్రపతి కి సందీప్ వివరంగా వివరించారు. తెలంగాణ సాయుధ పోరాటం కేంద్రంగా ఎంతోమంది ఈ ప్రాంతంలో ఉద్యమించిన తీరును, రజాకార్ల పోరాటంలో మృతి చెందిన అమరవీరుల వివరాలను ఉపరాష్ట్రపతి కి సందీప్ వివరించినట్లు తెలిపారు. దేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అతి పిన్న వయసులోనే ఐ ఆర్ ఎస్ కు ఎంపికైన సందీప్ భాగాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ మకరంద, ఐఎఫ్ఎస్ శ్రీపాల్ రెడ్డి,ఐపిఎస్ రంజిత్ కుమార్  పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

వెల్కమ్: మోదీకి శుభలేఖ అందించిన సీఎం రమేశ్

Satyam NEWS

కరోనాతో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి

Satyam NEWS

విద్య, వైద్యం కోసం రాచాల భరోసా యాత్ర

Satyam NEWS

Leave a Comment