ప్రేమించిన యువకుడితో పెండ్లిచేయడంలేదని భాదతో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నయువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దుండిగల్ మున్సిపాలిటీ, ఇందిరమ్మకాలనీకి చెందిన వైష్ణవి (18) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది.
వైష్ణవికి బహదూర్‌పల్లికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఓ యువకుడిని ప్రేమించానని, అతన్నే పెండ్లి చేసుకుంటానని వైష్ణవి తల్లిదండ్రులకు తెలిపింది. పరిస్థితుల నేపథ్యంలో పెండ్లికి కొంత సమయం పడుతుందని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.