38.2 C
Hyderabad
April 28, 2024 22: 37 PM
Slider నిజామాబాద్

దేవునిపల్లిలో కరోనా లక్షణాలతో భారమంతా దేవుడి మీదే

gampa govardhan

కామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు, అధికారులు.

కామారెడ్డి జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న దేవునిపల్లిలో బిల్డర్ గా పని చేస్తున్న 69 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ఆయన అనారోగ్యంతో ఉండటంతో ఈ నెల 27 న కిమ్స్ ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం వెళ్లగా అక్కడ అతనికి కరోనా పాజిటివ్ గా వైద్యులు గుర్తించారు.

వెంటనే గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేయడంతో అక్కడ బాధితుని శాంపిల్స్ తీసుకుని పుణెకు పంపించారు. అతనికి కరోనా వచ్చిందని అతనితో సన్నిహితంగా మెలిగిన 30 మందిని హోం క్వారంటైన్ కు తరలించినట్టు మంత్రి ప్రశాంత్ రెడ్డి  మీడియా సమావేశంలో వెల్లడించారు.

కరోనా పాజిటివ్ సమాచారంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దేవునిపల్లిలో హై అలర్ట్ ప్రకటించారు. గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేశారు. ప్రధాన రహదారులు, కాలనీలకు సంబంధించిన దారులను మూసి వేశారు. ఇంటింటి సర్వే చేపట్టారు. పారిశుధ్య పనులు వేగంగా చేపడుతున్నారు.

బాధితుని ఇంటితో పాటు గ్రామంలో బ్లీచింగ్ తో స్ప్రే చేస్తున్నారు. దేవునిపల్లి గ్రామంలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మరో వైపు బాధితుడు ఎవరెవరిని కలిశారు అన్న అంశం మీద అధికారులు విచారణ చేపడుతున్నారు.

ఈ నెల 6 వ తేదీన మేడ్చల్ లో ఓ పెళ్లికి హాజరు అయినట్టు అధికారులు గుర్తించారు. బాధితుడు కామారెడ్డిలో ఉంటూ బిల్డింగ్ పనులు చేపట్టే వాడని విదేశాలకు వెళ్లిన సందర్భాలు లేకపోవడంతో అతనికి కరోనా ఎలా వ్యాప్తి చెందింది అనే విషయంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

పాజిటివ్ ప్రచారంతో దేవునిపల్లి వాసులు మాత్రం భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. అయితే కరోనా పాజిటివ్ ప్రాంతమైన దేవునిపల్లిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పర్యటించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు కాలనీలలో అధికారులతో కలిసి తిరిగారు. వైద్య సిబ్బంది, సర్వే చేస్తున్న వారితో మాట్లాడారు. ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రజలు ఇళ్లలోంచి బయటకి రావద్దని గ్రామస్తులకు సూచించారు. ప్రభుత్వ విప్ వెంట జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి ఉన్నారు

Related posts

లోకేష్ ను చూస్తే జగన్ కు భయం

Satyam NEWS

గౌరవేణి సరితకు డాక్టరేట్ ప్రధానం

Satyam NEWS

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి: ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన

Satyam NEWS

Leave a Comment