అయోధ్య తీర్పు నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకి కొల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ వద్ద నాగర్ కర్నూల్ డి ఎస్ పి ఆధ్వర్యంలో కొల్లాపూర్ సర్కిల్ సిఐ అధ్యక్షతన శాంతి సమావేశం ఏర్పాటు చేసినట్లు కొల్లాపూర్ ఎస్.ఐ కొంపల్లి మురళి గౌడ్ ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ సమావేశంలో కొల్లాపూర్ పట్టణంతో పాటు కొల్లాపూర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న హిందూ మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు అదేవిధంగా ఇతర ముఖ్య వ్యక్తులు అందరూ హాజరు కావాలని కొల్లాపూర్ ఎస్.ఐ కొంపల్లి మురళి గౌడ్ కోరారు. అదే విధంగా మీడియా మిత్రులు కూడా హాజరు కావలసిందిగా ఆయన కోరారు.
previous post