30.2 C
Hyderabad
October 13, 2024 17: 09 PM
Slider తెలంగాణ

అర్హులైన జర్నలిస్టులకందరికీ అక్రిడిటేషన్ సౌకర్యం

allam narayana

సమాచార భవన్ లోని మీడియా అకాడమి కార్యాలయంలో వీడియో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 18 వేల మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేశామని అన్నారు.

వీడియో గ్రాఫర్లను వీడియో జర్నలిస్టులుగా గుర్తించినందున జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. వీడియో జర్నలిస్టులు వృత్తి నైపుణ్యం పెంచుకుని వృత్తిలో రాణించాలని సూచించారు.  ఈ దఫా తొలిసారిగా అక్రెడిటేషన్ కార్డులను ఆన్ లైన్ ప్రక్రియలో చేపట్టినట్లు తెలిపారు.

ఆన్ లైన్ ప్రక్రియ వల్ల అక్రెడిటేషన్లలో పూర్తి పారదర్శకత పాటించామని తెలిపారు. మహిళా జర్నలిస్టులకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. అక్రెడిటేషన్ ల వల్ల బస్సులు, రైళ్ల చార్జీలో రాయితీలు అలాగే ఎ.సి./గరుడ బస్సులలో కూడా చార్జీల రాయితీ వర్తిస్తుందన్నారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ హష్మి, టీయూడబ్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెమ్జూ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్, రాష్ట్ర నాయకులు వర్ధెల్లి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ యోగానంద్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు పాల్గొన్నారు. ఇంకా తెలంగాణ వీడియో జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు పొలంకి ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి వనం నాగరాజు, జాయింట్ సెక్రటరీ రవికిరణ్, వైస్ ప్రెసిడెంట్ జనార్థన్ రెడ్డి, కోశాధికారి భిక్షపతి, తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

ఒక్కసారి అవకాశం ఇవ్వండి  అభివృద్ధి చేసి చూపిస్తా

Satyam NEWS

కరోనా బాధితులకు పండ్లు పంపిణీ చేసిన సీపీఎం జిల్లా కమిటీ

Satyam NEWS

సంగారెడ్డిలో కనిపించిన పరారీ వైసీపీ నేత పిన్నెల్లి

Satyam NEWS

Leave a Comment