సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఒక వర్గాన్ని లేదా మతాన్ని కించపర్చే విధంగా పోస్టింగ్ లు చేయరాదని పోలీసులు కోరారు. త్వరలో అయోధ్య స్థల వివాదంపై తీర్పు వెలువడబోతున్న సందర్భంగా నేడు నాగర్ కర్నూల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ ఎస్పి అపుర్వరావు ఆదేశాల మేరకు మత పెద్దలతో నాగర్ కర్నూల్ డి.ఎస్.పి మోహన్ రెడ్డి శాంతి సమావేశం నిర్వహించారు. అన్నీ మతాలు, కుల పెద్దలతో, యువజన సంఘ నాయకులతో ఈ శాంతి సమావేశం జరిగింది. అన్ని మతాల వారూ సోదర భావంతో ఉండాలని ఎవ్వరైనా చట్ట విరుద్దమైన పనులు చేసినా, ఇతరుల మనోభావాలను కించే పర్చే విధంగా చేసినా చట్ట పరమైన చర్యలను తీసుకోవడం జరుగుతుందని డి ఎస్ పి చెప్పారు. తీర్పు ఏదైనా అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు గౌరవించాలని, ఒకరి విజయంగా , మరొకరి ఓటమిగా భావించకూడదని, ఒక జటిలమైన సమస్య పరిష్కారం అయిందని భావించి సంతోషించాలని పోలీసు అధికారులు చెప్పారు. మతపెద్దలు,వివిధ సంఘ నాయకులు సహనముతో ఉండాలని, అయోధ్య తీర్పు పట్ల ప్రతి ఒక్కరూ నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులకు సహకరించి జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంలో సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ డి.ఎస్.పి మోహన్ రెడ్డి, సిఐలు గాంధీ నాయక్, బిజినేపల్లి ఎస్ ఐ లక్ష్మి నర్సింహులు, తిమ్మాజిపేట ఎస్ ఐ శ్రీనివాసులు, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్ లు, కానిస్టేబుల్ లు, వివిధ మతాల, వర్గాల, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
previous post