24.7 C
Hyderabad
May 19, 2024 00: 40 AM
Slider చిత్తూరు

టీడీపీ అభ్యర్ధి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్న జనం

#vmthomas

తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఓట్ల పండగకు ముందే నోట్ల పండుగ వచ్చింది. సాధారణంగా ఓట్ల పండగ సమయంలో పోటిలో ఉన్న అభ్యర్థులు నోట్లను పంచడం ఆనవాయితీగా వస్తోంది. నోట్లు పంచకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటర్లు పోలింగ్ బూతులకు వచ్చి ఓటేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి, ఆ పార్టీ ఆర్థిక స్తోమతను బట్టి ప్రతి ఓటరుకు వేయి నుంచి రెండు వేల రూపాయలను పోలింగ్ రోజుకు ముందు రాత్రి పంపిణీ చేస్తుంటారు.

ఇది రహస్యంగా జరుగుతుంది. అయితే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎన్నికల రాకుండా నోట్ల పండుగ మాత్రం వచ్చింది. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ ఎక్కడికి వెళ్లినా ప్రజలకు నోట్లను పంపిణీ చేస్తున్నారు. దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. దీంతో డాక్టర్ థామస్ కు నియోజకవర్గంలో క్రేజ్ ఏర్పడింది. తమ ఉరికి ఎప్పుడూ వస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి ఇంచార్జి తమకు ఎందుకు లేదంటూ ఇతర నియోజకవర్గ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

చెన్నైలో ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్ థామస్ ను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు ఇన్చార్జిగా నియమించారు. థామస్ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న తరహాలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ముఖ్యంగా చర్చలు, దళితవాడలపైన దృష్టిని కేంద్రీకరించారు. ఆయన వెళ్లిన ప్రతిచోట నిరుపేదలకు 200 రూపాయల నోట్లను పంపిణీ చేస్తున్నారు.

తనను తాను దాన కర్ణుడుగా వర్ణించుకున్న థామస్ కు ఎక్కడికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తండోప తండాలుగా తరలివస్తున్నారు. సమావేశం ముగిసిన తర్వాత ఆయనే స్వయంగా నోట్లను పంపిణీ చేస్తారు. అప్పటి వరకు ఉండి  ప్రజలు నోట్లు తీసుకొని ఇంటికి పోతున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. డాక్టర్ థామస్ ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించినా, ఆ నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఎవరు థామస్ కు సహకరించడం లేదు.

ప్రచారంలో ఆయన వెంట నడవడం లేదు. ఇంతకుముందు ప్రచార కార్యక్రమాలను ముందుండి నడిపించిన నియోజకవర్గ మాజీ సమన్వయకర్త చిట్టిబాబును  రిసార్ట్ వ్యవహారముతో అధిష్టానం పక్కన పెట్టింది. దీంతో థామస్ ఒంటరివాడయ్యారు. దీంతో  ప్రజల దగ్గరికి వెళ్లి వారిని ఆకర్షించడానికి వినూత్న ఆలోచనలకు పదునబెట్టారు. దాంతో ఎక్కడికి వెళ్లినా 200 రూపాయల నోట్ల కట్టలను తీసుకువెళ్తున్నారు. వాడ వాడకు వెళ్లి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి థామస్ పేరుతో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. థామస్ వస్తున్నారని తెలిస్తే పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు ఆయనను చుట్టుముట్టుతున్నారు. గజమాలలతో స్వాగతం పలుకుతున్నారు. హారతులిస్తున్నారు.

డబ్బులను డాక్టర్ థామస్ స్వయంగా పంపిణీ చేస్తూ తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి సవాల్ చేస్తున్నారు. దమ్ము ఉంటే తనలాగా ప్రజలకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా సవాల్ చేస్తున్నారు. దానకర్ణ డాక్టర్ V.M థామస్ ని చూసి, దానహీనుడు డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గంలో నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. డాక్టర్ థామస్ పుట్టుకతో నిరు పేద. కష్టం మీద, స్వయంకృషితో క్రమక్రమంగా ఎదిగిన డాక్టర్ థామస్ ఈరోజు ఆర్థిక పరిపుష్టితో తాను పుట్టిన గడ్డకు తన వంతు సేవ చేయాలని చేయాలని దృక్పథంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు.

అతను మానవసేవే మాధవ సేవగా భావించి, అతను వెళ్లే ప్రతి కార్యక్రమానికి పేదవారికి తగిన ఆర్థిక సహాయం చేయడం అతనికున్న మంచి అలవాటు. పేదవాళ్ళని చూసి చలించిపోయి అప్పటికప్పుడు పేదరికాన్ని పోగొట్టలేక ఆ పేదవారికి ఆర్థిక సహాయం చేసి ఆనందపడుతుంటారు. డాక్టర్ థామస్ చేసే, ఈ చిరు సహాయాన్ని కూడా ఓర్చుకోలేని నరకాసురులు వైసిపి కార్యకర్తలు వాలంటీర్లు కళ్ళు మండిపోయి కడుపు ఎండిపోయి తన బ్లూ పేపర్లో తప్పులుగా రాతలు వ్రాయించుకుని, కూతలు కుయించినంత మాత్రాన పేదవారికి డాక్టర్ థామస్ సహాయాన్ని ఆపే దమ్ము ఎవడికి లేదు.

కోట్లు కోట్లు సంపాదించిన నారాయణస్వామి ఇప్పటికీ నేను పేదవాడని చెప్పుకుని, పెత్తందారులకు గులంగిరి చేస్తూ, పేదవారి దగ్గర ఓట్లు దండుకోవాలని చేస్తున్న కపట నాటకాలు, కుటిల రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం….. పేదవాడైనా దానం చేసేవాడే దానకర్ణుడు ఎంత డబ్బులున్నా పెట్టలేని వాడు హీన కర్ముడు. పెట్టే వాళ్లను చూసి నోరు నెత్తి కొట్టుకునే ఇలాంటి వైసీపీ దుర్మార్గులను వచ్చి ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టాలని డాక్టర్ థామస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని తెలుగుదేశ కార్యకర్తలకు పేద ప్రజలకు చదువుకున్న యువకులకు మనవి చేస్తున్నాము అంటూ థామస్ అభిమానులు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు

Related posts

YSR తెలంగాణ పార్టీ సింగిల్ కో-ఆర్డినేటర్ గా దొంతమాల

Satyam NEWS

బిజెపికి బలం లేకపోతే ఇంత మంది ఎందుకు వచ్చారు?

Satyam NEWS

మునిసిపల్ దుకాణాల కేటాయింపు కోసం అక్రమ వసూళ్లు

Bhavani

Leave a Comment