31.7 C
Hyderabad
May 6, 2024 23: 28 PM
Slider మహబూబ్ నగర్

మునిసిపల్ దుకాణాల కేటాయింపు కోసం అక్రమ వసూళ్లు

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలో షాపుల వేలంలో అవకతవకలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి యువసేన కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ తాలూకా అధ్యక్షులు డీకే మాదిగ ఆరోపించారు. చిరు వ్యాపారులతో మునిసిపల్ వైస్ చైర్మన్ భర్త వసూళ్ల దందా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 93 దుకాణాలకు వేలంపాట వేస్తే అందులో 34 దుకాణాలకు అగ్రిమెంట్ అయినట్లు మునిసిపల్ అధికారులు చెప్పారని ఆయన తెలిపారు. మిగిలిన 59 దుకాణాలకు టెండర్స్ వేస్తే వేలంపాట పడటానికి వెళ్ళిన వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. వీరిపై కక్ష ఎందుకని డీకే మాదిగ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మునిసిపల్ వైస్ చైర్మన్ భర్త ఖాదర్ పాషా తన అనుచరుడైన, చిన్నాతో చిరు వ్యాపారులకు షాపులు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని వత్తిడి తెస్తున్నారని ఆయన అన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని డికె మాదిగ ప్రశ్నించారు.

చెప్పుల దుకాణం నడిపే ఎండి గౌస్ పాషా షాపు కోసం ఒకటో సారి లక్ష రూపాయలు,. రెండోసారి 21000 ఇవ్వడం జరిగింది. మూడోసారి 15000, నాలుగో సాయి 55000 ఇవ్వడం జరిగింది. అయినా కూడా అతడికి షాపు దక్కలేదని డికె మాదిగ అన్నారు. చిన్న వ్యాపారి అయిన అతని నుంచి వత్తిడి చేసి ఇంత సొమ్ము గుంజారని డికె మాదిగ తెలిపారు. మొబైల్ షాప్ నడిపే కిరణ్, పాన్ షాపు నడిపే జమీర్ అహ్మద్ లు కూడా లక్షలకు లక్షలు చెల్లించారని ఆయన తెలిపారు. నాలుగో బాధితుడు బాలకృష్ణ అలియాస్ బాలు, ఇతను కూడా రెండు సార్లు 20000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఐదో భాదితురాలు చెన్నమ్మ, మాదిగ జాతికి సంబంధించిన వ్యక్తి. భర్త చనిపోయాడు ఆమె దగ్గరికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తే ,నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది. ఈ రకంగా మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త ఖాదర్ బాషా అతని అనుచరుడు చిన్న చేస్తున్న వసూళ్ల దందాపై, ఐదు మంది బాధితులు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని డికె మాదిగ అన్నారు.

Related posts

సమస్యలను లేవనెత్తే ఏకైక లీడర్ షర్మిల

Satyam NEWS

మంత్రి చెల్లుబోయినపై ఎంపి ఫిర్యాదు

Satyam NEWS

హైదరాబాదులో మళ్లీ తెరుచుకోనున్న మార్కెట్లు

Satyam NEWS

Leave a Comment