Slider కృష్ణ

జగన్ రాజ్యంలో ఒక జర్నలిస్టు ఆత్మహత్య

#journalistchandra

జగన్ రాజ్యంలో ఒక జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక సంఘటన జరిగింది. కృష్ణా జిల్లా, చలపల్లి కి చెందిన సీనియర్  జర్నలిస్టు  చంద్ర  ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనునిత్యం కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న జర్నలిస్ట్స్ సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధివిధానాలకు  చల్లపల్లిలో జరిగిన కల్లేపల్లి చంద్ర ఆత్మహత్య నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చు.

కుటుంబ పోషణ భారమై  పిల్లల హాస్టల్ ఫీజు చెల్లించలేని దుస్థితిలో చంద్ర బలవన్మరణానికి పాల్పడ్డాడు. పాత్రికేయుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు చంద్ర ఆత్మహత్యకు  బాధ్యత వహించాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్  అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (పెన్ )జర్నలిస్ట్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బడే ప్రభాకర్ డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ చంద్ర కుటుంబాన్ని  ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రూ.25 లక్షలు పరిహారం చెల్లించడంతోపాటు  కుటుంబ పోషణ నిమిత్తం భార్యకు  ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని  డిమాండ్ చేశారు.

Related posts

పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి ఎన్నికలకెందుకు?

Satyam NEWS

రమేశ్ హాస్పిటల్స్ పై చర్యలకు ఐఎంఏ అభ్యంతరం

Satyam NEWS

152 మంది పెట్టిన కేసులు ఎత్తివేయడం సంతోషదాయకం

Bhavani

Leave a Comment