38.2 C
Hyderabad
May 5, 2024 19: 59 PM
Slider పశ్చిమగోదావరి

ప్రత్యేక పారిశుధ్య నిర్వహణకు 450 మంది కార్మికులు ఏర్పాటు

#eluru

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. నూజివీడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం  పంచాయతీ  విస్తరణ అధికారులు,  కార్యదర్శులతో డివిజనల్ స్థాయి సమీక్షా సమావేశం డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ నిర్వహించారు. ఈ సమావేశం లో విస్తారణాధికారులకు కార్యదర్శులకు పారిశుధ్య నిర్వహణ పై పలు సూచనలు చేసారు. ఈ సందర్బంగా డీపీఓ శ్రీనివాస మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17 వ తేదీ న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి జిల్లా పర్యటనకు రానున్నారని తెలిపారు.

సి ఎం పర్యటన సందర్భంగా పారిశుధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదరులు, విస్తరణ అధికారులతో ముందస్తు  సమీక్షా సమావేశం నిర్వహించారు. హెలిప్యాడ్, ఎం.ఐ.జి లేఔట్, వాహనాలు పార్కింగ్ ప్రాంతాలలో ముఖ్యంగా హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ ప్రాంగణం రోడ్డు మార్గంలో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు జరగాలని సిబ్బందిని ఆదేశించారు. అంతేగాక నూజివీడు పట్టణం పరిసర ప్రాంతాలలో 14 గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందని ఈ ప్రాంతాలలో డ్రైనేజీ క్లీనింగ్, మలతీయన్ పిచికారీ, లోతట్టు ప్రాంతాలు శుభ్రం చేయడం, త్రాగునీరు ట్యాంకులు క్లీనింగ్, ఫాగ్గింగ్ యంత్రాలతో దోమల నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి 450 మంది కార్మికుల సేవలను, 200 మంది పంచాయతీ కార్మికులను వినియోగించునున్నామని డి పి ఓ చెప్పారు. విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో జరిగే పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలను డివిజనల్ పంచాయతీ అధికారులు పర్యవేక్షణ చేయనున్నారని, విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని సమావేశంలో డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ హెచ్చరించారు. కార్యక్రమంలో కమీషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్, డివిజనల్ పంచాయతీ అధికారి సుందరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్లేవరీ:9 నెలలుగా జీతం లేక ప్రొఫెస‌ర్ ఆత్మ‌హ‌త్య‌

Satyam NEWS

జగన్ పై మరో వైసీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు

Satyam NEWS

రామప్ప ముంపు బాధితులకు సేవా భారతి సేవలు

Satyam NEWS

Leave a Comment