30.2 C
Hyderabad
May 17, 2024 14: 51 PM
Slider నల్గొండ

నిరుపేదల ఇళ్లను ఖాళీ చేయించడం సరి కాదు

HujurabadMunicipality

గడిచిన 30 సంవత్సరాలకు  పైగా SBI బ్యాంక్ ఎదురుగా  గుడిసెలు వేసుకొని జీవిస్తున్న కడు పేదల వారి ఇళ్ళను తొలగించటం  అన్యాయం అని, వారికి ప్రత్యామ్నాయంగా స్థలాలను ఏర్పాటు చేసిన తర్వాతనే ఖాళీ చేయించాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ప్రభుత్వాన్ని కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ  ఆర్టీవో కార్యాలయంలో మంగళవారం DEO సంధ్యారాణికి, మున్సిపల్ కార్యాలయంలోని మేనేజర్ కి వినతిపత్రం ఇచ్చిన అనంతరం రోషపతి మాట్లాడుతూ SBI బ్యాంక్ ఎదురుగా ఉన్న వారికి నాటి సర్పంచ్ చింతలపూడి రాములు,  గ్రామ పంచాయతీ అధికారులు సి ఎం ఎస్ కాంప్లెక్స్ కోసం ప్రత్యామ్నాయంగా R&B బంగ్లా పక్కన బ్యాంక్ ఎదురుగా ఇండ్లు ఏర్పాటు చేయ్యటం జరిగిందని అన్నారు.

ఈ రోజు మున్సిపల్ అధికారులు ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వడం సరైంది కాదని, అందులో అర్హులైన వాళ్లందరికీ ఇండ్లు మంజూరు చేసిన తర్వాతే వారిని ఖాళీ చేయించాలని కోరారు. బైపాస్ రోడ్డు ఉండగా హుజూర్ నగర్ మెయిన్ రోడ్ లో అధిక లోడుతో సిమెంట్ పరిశ్రమలకి చెందిన హెవీ లారీలు ఊర్లో నుంచి పోవడం వల్ల వేలాది మంది ప్రజలు, వివిధ షాప్ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ప్రధాన రహదారులన్నీ గుంటలు ఏర్పడి పాదచారులకు, ద్విచక్ర వాహనదారులకు అనేక ఇబ్బందులు కలుగుతుంటే, చిన్న వర్షానికే ప్రధాన రహదారులు జలమయం అవుతుంటే వాటిమీద కమిషనర్, సంబంధిత అధికారులు దృష్టి పెట్టకుండా సందులో ఉన్న 30 మంది నిరుపేదల ఇంళ్ళను ఖాళీ చేయాలనటం సరైందికాదని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎలక సోమైయ్య గౌడ్, దేవరకొండ రామ్ రాజ్, ఎస్ కె అజ్జు, సైదమ్మ, లింగమ్మ, తిరుపతమ్మ, బుచ్చమ్మ, బాధితులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రకాశం జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు

Satyam NEWS

చివరికి యూట్యూబ్ చానల్ పెట్టుకున్న రాఘవేంద్ర రావు

Bhavani

మహిళా రిజర్వేషన్లు 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలి

Satyam NEWS

Leave a Comment