30.2 C
Hyderabad
May 17, 2024 19: 22 PM
Slider ప్రత్యేకం

మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ వేలంలో లక్షల పాట…

#kollapurmunicipality

హైదరాబాద్ ను మించిన కొల్లాపూర్….రాష్ట్రంలో చర్చగా మారిన కొల్లాపూర్ ..!

రాష్ట్రంలో  కొల్లాపూర్  అంటేనే ఒక ప్రత్యేకత కనిపిస్తున్నది. వర్గ విభేదాలతో నాయకులు ప్రతినిత్యం ఒకరిపై ఒకరు తగ్గేదే లేదంటూ విమర్శలు, ప్రతి విమర్శలు,సవాలు, ప్రతి సవాలు చేసుకుంటూ రాష్ట్రంలో ఒక చర్చ జరిగేలా ఉంటారు. ప్రస్తుతం కొల్లాపూర్ ప్రజలు కూడా ఇలాగే తగ్గేదే లేదంటున్నారు.

ఇప్పుడు ఇది కూడా ఒక చర్చగా మారింది. మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాటలో లక్షలలో పలికింది. కొల్లాపూర్ మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ కు ఇదివరకు వేలంపాట నిర్వహించారు. అది  కోర్టు పరిధికి వెళ్ళింది. కోర్టు ఆదేశాలతో  మున్సిపల్ కమిషనర్ సొంటె రాజయ్య ఆధ్వర్యంలో రిజర్వేషన్ ప వారీగా ఓపెన్ టెండర్ ప్రకటన ఇచ్చారు.

దీ నితో 140 మందికి పైగా డీడీలు చెల్లించి అప్లికేషన్ చేసుకున్నారు. బుధవారం షాపింగ్ కాంప్లెక్స్ కు రిజర్వేషన్ వారిగా వేలంపాట నిర్వహించారు. అయితే కొందరు షాపులను కొనుగోలు చేస్తున్నట్లు ఫీలయ్యారు. ఎస్సీ రిజర్వేషన్ లో ఏకంగా ఒక షాపుకు 81వేలు నెల కిరాయి కట్టడానికి ముందుకు వచ్చారు. వేలంపాటలో షాప్ ను దక్కించుకున్నారు.

జనరల్ లో ఓ షాపుకు రెండు లక్షల పైగా వేలంపాట పాడి నెల కిరాయి  కట్టడానికి ముందు వచ్చారు. మరొకరు లక్ష పదిహేను వేలు వేలంపాట పాడారు. ఇలా కొందరు 60,40, 30 వేలలో వేలంపాట పాడారు. అయితే కొల్లాపూర్ మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ 60 నుంచి 70 లక్షలు ఉంటుంది. కానీ నెల కిరాయిలు  లక్షల రూపాయలలో  కట్టడానికి ప్రజలు ముందుకు వచ్చారు.

కొందరు హైదరాబాదులో కూడా ఇంత కిరాయిలు ఉంటాయో లేదో అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. వేలంపాట నిర్వహించడంతో పోటీ పెరిగి ఇలా లక్షల కిరాయిలు చెల్లించడానికి ముందుకు వచ్చారు. వేలంపాటలో షాప్ లను దక్కించుకున్న వారి పేర్లను షాప్ నెంబర్లను సీల్డ్ కవర్లో హైకోర్టుకు మున్సిపల్ కమిషనర్ రాజయ్య సమర్పించనున్నారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న వారికి ప్రశంస

Satyam NEWS

25 కు 25 గెలిచే వాతావరణమే ఉంటే ఈ ఏడుపెందుకు?

Satyam NEWS

వార్నింగ్: రాష్ట్ర ప్రభుత్వం అధికారులను బెదిరిస్తే ఊరుకోం

Satyam NEWS

Leave a Comment