30.2 C
Hyderabad
May 17, 2024 16: 01 PM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ లో సోరకాయల వర్షం

#kollapur

సాధారణంగా సోర చెట్లకు దాని పరిధి ఉన్నంత వరకు, దాని కాలం అయిపోయే వరకు  10 నుండి 15 కాయలు కాస్తుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ  సోరకాయలు అన్నీ ఒకే ఒక్క సోర చెట్టుకు  కాసినవి. అవి దాదాపు  50 కి పైనే  సోరకాయలు (అనపకాయలు)  ఉన్నవి. 

ఇవి ఎక్కడో అని ఆశ్చర్య యు పోకండి. ఈ కాయలన్ని కూడా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రం లోని చుక్కాయిపల్లి కాలనీ లోని మారెడి కురుమయ్య ఇంటిలో ఈ సొరకాయల వర్షం కురుస్తున్నది. అదేంటో గాని మంత్రం దండం ఊపినట్టుగా, మర్రి చెట్టు ఉడల్లా ఆ సొరకాయలు వస్తూనే ఉన్నాయి. 

పెద్దవి చిన్నవి, మాధ్యస్థానివి అనీ రకాల సైజుల్లో కాయలు మిద్దె పై నుండి కిందికి వస్తున్నాయి. 5…. 10…. 15. ఆశ్చర్యం,  20…. 25. ఎందిరా భాయ్ 30….35…. ఇదేం చెట్టురా నాయన 40.  ఇంకా ఉన్నాయా!!!  ఇంకా ఎన్ని ఉన్నాయి, ”  చూస్తే తెలిసిద్ది”  పై నుండి సమాధానం , 45…. చల్ల చలికి చెమటలు పడుతున్నాయి46…… హహ, 47…. ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకే సారి  రమ్మను అనేలా ఉంది.

48… ఏయ్ పిచేసే మార్ 49…  ఒక్కొక్క సొరకాయ  నేలకు ఒరుగుతున్నాయి. యుద్ధంలో ఓడిపోయిన వీరుల్లా.50….. హమ్మయ్య….పిండ్రాప్ సైలెంట్.  యుద్ధం ముగిసింది. మొత్తానికి 50 సొరకాయలు కాసిన సోర చెట్టు ఇది. చుట్టుపక్కల వాళ్లంతా వచ్చి చూస్తున్నారు ఈ సొరకాయల వర్షాన్ని…..

Related posts

ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం… వైసీపీకి షాక్

Satyam NEWS

నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ  ‘ఏయ్… పిల్లా’

Satyam NEWS

కుప్పంలో 18 లక్షల టన్నుల బంగారం

Satyam NEWS

Leave a Comment