26.7 C
Hyderabad
May 3, 2024 09: 40 AM
Slider ప్రత్యేకం

కుప్పంలో 18 లక్షల టన్నుల బంగారం

#goldmine

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం బంగారు మయం కానుంది. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం ‘చిగర్ గుంట-బిసనత్తమ్’ మధ్య బంగారు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 18 లక్షల టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా. అక్కడ బంగారును తవ్వుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన హుట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ 500 కోట్ల రూపాయల లీజుకు దరఖాస్తు చేసింది. పర్యావరణ అనుమతులు కూడా లభిస్తే రెండు సంవత్సరాలలో బంగారు తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. వేయికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

కర్నాటకకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. చిత్తూరు జిల్లాలో ఉన్న గనిలో ఏకంగా 18 లక్షల టన్నుల గోల్డ్ నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ గనిని రూ. 500 కోట్లు చెల్లించి లీజుకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది.  కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూసివేసినప్పటి నుంచి దేశంలో బంగారం ఉత్పత్తి అనేది దాదాపు ఆగిపోయింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఏటా 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశం మనదే. అయితే దేశంలోని గనుల నుండి బంగారాన్ని ఉత్పత్తి చేసే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇనుప ఖనిజాలతో పాటు అరుదైన ఖనిజాల తవ్వకాలను చేపట్టే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం తవ్వకాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం గోల్డ్ మైనింగ్ మొదటి ప్రయత్నంలో భాగంగా రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎన్ఎండీసీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నాయని చాలా కాలం క్రితమే గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహా మరికొన్ని సంస్థలు సర్వే చేసి ఎక్కడెక్కడ, ఎంత మేర బంగారు ఖనిజ నిల్వలు ఉన్నాయనే దానిపై కీలక సమాచారాన్ని సేకరించాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో ఉన్న ‘చిగర్ గుంట-బిసనత్తమ్’ బంగారు గనిలో 18 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు అంచనా. ఒక్కో టన్ను నుంచి 5 గ్రాములకు పైగా బంగారం తీయవచ్చునని అంచనా వేసినట్లు సమాచారం. ఈ గనిలో తవ్వకాలు చేపట్టడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేసింది ఎన్ఎండీసీ. ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు వంటి క్లియరెన్స్ తెచ్చుకోవడానికి ఎన్ఎండీసీ కంపెనీ ఒక కన్సల్టెంట్ ను నియమించాలని యోచిస్తుంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే రెండేళ్లలో అన్ని పనులూ పూర్తి చేసి బంగారం గని తవ్వకాలు ప్రారంభించాలని ఎన్ఎండీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా తర్వాత ఎక్కువగా బంగారాన్ని వినియోగిస్తున్న దేశం భారతదేశం. పండుగలు, పెళ్లిళ్లలో ఖచ్చితంగా బంగారం ఉండాల్సిందే. దిగుమతుల ద్వారా భారతదేశం 90 శాతం కంటే ఎక్కువ బంగారం డిమాండ్ ని దాటేసింది. 2022లో 36.6 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి మరీ బంగారు లోహాన్ని దిగుమతి చేసుకుంది. 2021లో అత్యధికంగా 55.8 బిలియన్ డాలర్ల బంగారం లోహాన్ని ఇంపోర్ట్ చేసుకుంది. కుప్పం దగ్గరలో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో ఎన్నో ఏళ్లుగా బంగారం గనులను తవ్వుతున్నారు. రాయ్ చూర్ సమీపంలో కర్ణాటక ప్రభుత్వానికి చెందిన హుట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ కూడా దేశంలోనే అతి పెద్ద బంగారు గనిని నిర్వహిస్తోంది. దేశంలో ఎక్కువ శాతం బంగారం ఉత్పత్తి చేసే కంపెనీ ఇదే.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్ట్, చిత్తూరు

Related posts

శేషాచలం అడవులను జల్లెడ పడుతున్న టాస్క్ ఫోర్స్

Satyam NEWS

మేడ్చల్ లో ‘ భరోసా ‘ కేంద్రంను ప్రారంభించిన డీజీపీ మహేందర్ రెడ్డి

Satyam NEWS

జంపన్నవాగులో బాలుడు గల్లంతు

Satyam NEWS

Leave a Comment