33.2 C
Hyderabad
May 15, 2024 21: 44 PM
Slider గుంటూరు

అనునిత్యం ప్రజలతో ఉంటున్న ఎమ్మెల్యే పైనా విమర్శలు?

#ysrcongress

కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయన్న సామెత చందంగా శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి  పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు సహజమేనని గుంటూరు జిల్లా నరసరావు పేట వైసీపీ నాయకుడు పిల్లి  ఓబుల్ రెడ్డి అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా డయల్ యువర్ ఎమ్మెల్యే, గుడ్ మార్నింగ్ నరసరావుపేట పేరుతో  అను నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తీరుస్తున్న ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం బాధాకరమని ఆయన అన్నారు.

గత టిడిపి చరిత్రను చూస్తే ప్రతి చిన్న వ్యాపారస్తులు దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా ఏ విధంగా  దందాలు చేశారో నరసరావుపేట ప్రజలందరికీ తెలుసని, ప్రస్తుతం ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి తక్షణమే వారి సమస్యలు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే దగ్గరికి ప్రజలందరూ వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవడం చూసి ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు.

గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే తెలుగుదేశం నాయకులకు కప్పం కట్టాల్సి వచ్చేదని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అంతేకాకుండా గతంలో శాసనసభ్యుల వారి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ నుంచి తొలగించిన ఘనత మీది కాదా? అని ఆయన ప్రశ్నించారు. చదలవాడ అరవింద్ బాబు ఆసుపత్రికి ఇప్పటికీ ఆరోగ్యశ్రీ కొనసాగుతూనే ఉందని ఏ రోజు ఎటువంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు అని అటువంటి మంచి వ్యక్తిత్వం గల గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని  విమర్శించడం తగదని ఆయన అన్నారు.

పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకున్న దుర్మార్గులు టీడీపీ వారు

జగనన్న కాలనీల పేరుతో 15 వేల కుటుంబాలకు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టుకెళ్లి అడ్డుకున్న దుర్మార్గులు మీరు అని మీకు గోపి రెడ్డి ని విమర్శించే స్థాయి ఎక్కడుందని ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకొకటి లేదని తీవ్రంగా విమర్శించారు. కేవలం సీటు కోసం పోరాటం లో భాగంగానే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై చదలవాడ విమర్శలు చేస్తున్నారని, మీకు దమ్ముంటే మున్సిపల్ ఎన్నికలను అడ్డుకుంటూ కోర్టులో వేసిన పిటిషన్లను తక్షణమే   విత్ డ్రా చేసుకుని ఎన్నికలకు రండి !ఎవరి సత్తా ఏమిటో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం! అని పిల్లి ఓబుల్ రెడ్డి  అన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్ గారి భర్త ఖాజావలి మాస్టర్ మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా  అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించిన 72 షాపులు కూల్చివేసి ఆ కుటుంబాలకు అన్యాయం చేశారని అన్నారు. ఎన్నికల్లో షాపుల నిర్మాణంతో పాటు, మసీదు కూడా కట్టిస్తానని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాగ్దానం చేశారని చేసిన వాగ్దానం మేరకు మసీదు నిర్మాణం ప్రారంభించారని 2 మాసాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా ప్రారంభిస్తారని అన్నారు.

నాయకుడు అంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, అప్పుడే ప్రజలు ఆదరిస్తారని, అంతేకాకుండా ఆటోనగర్ నిర్మాణానికి కూడా త్వరలోనే అన్ని అనుమతులు తీసుకొని ప్రారంభిస్తారని తెలిపారు. అంతే కాకుండా కరోనా మహమ్మారి సమయంలో అందరికీ వైద్య సేవలు అందేలా జిల్లా వైద్యశాల అందుబాటులోకి తెచ్చి అందరికీ వైద్యం అందేలా చేసి వేలాది మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఎమ్మెల్యే అని ఆయన తెలిపారు. నిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటు పడే ఎమ్మెల్యే పై ప్రతిపక్షాలు ఏమి చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలియజేశారు.

నరసరావుపేట ఎస్సీ నాయకులు కందుల ఎజ్రా మాట్లాడుతూ అను నిత్యం ప్రజలతో మమేకమై ప్రజాసమస్యలు తీరుస్తారు కాబట్టే గోపి రెడ్డి కి 32 వేల  మెజార్టీ నరసరావుపేట ప్రజలు ఇచ్చారని ,గత 20 సంవత్సరాలుగా మంచినీటి వసతి లేని శివారు ప్రాంతాలకు సైతం మంచినీటి వసతి కల్పించిన ఘనత గోపి రెడ్డి కి దక్కుతుందని అన్నారు. గోపి రెడ్డి పై చదలవాడ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎస్సీ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు. మైనార్టీ సెల్  అధ్యక్షులు షేక్ ఖాదర్ భాష మాట్లాడుతూ మీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మున్సిపాలిటీ పై వేసిన కోర్టులో కేసు వెనక్కి తీసుకొని తక్షణమే మున్సిపల్ ఎలక్షన్ కి రావాలని తద్వారా ప్రజలు ఇచ్చే తీర్పులో నే మీకు అర్థం అవుతుంది అని తెలిపారు.

Related posts

దాసుకి ఊస్టింగ్… ప్రసాదుకి పోస్టింగ్

Satyam NEWS

కూరగాయలు పంచిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్

Satyam NEWS

మధుర లో కలకలం సృష్టించిన ఇద్దరు మహిళల మృతదేహాలు

Satyam NEWS

Leave a Comment