ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం జరిగింది. ఇంత కాలం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహాలు అందించిన ప్రశాంత్ కిషోర్ ఇక నుంచి తెలుగుదేశం పార్టీకి తన సేవల అందించబోతున్నారు. దాదాపుగా ఈ డీల్ ఖరారైంది. ఒక్క సారిగా జరిగిన ఈ పరిణామంతో వైసీపీ శ్రేణులు హతాశులయ్యారు. ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీ గెలిస్తుందో ఆ పార్టీ వైపు ఉంటారని అందరూ చెప్పుకుంటారు. ఈ లెక్కన ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ వైపు చేరడంతో ఇక ఏపిలో వైసీపీ గల్లంతేనని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ ఒకే కారులో వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రధాన పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఈ సారి తెలుగుదేశం వైపు చేరడం గమనార్హం. ఒక్కసారిగా గన్నవరం విమానాశ్రయం లో టి.డి.పి పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వెంట కనిపించటం తో వై.సి.పి నాయకులు షాక్ తిన్నారు. ఓకే వాహనంలో ఎక్కి నారా లోకేష్,ప్రశాంత్ కిషోర్ విజయవాడ వెళ్లారు.
previous post