29.2 C
Hyderabad
May 18, 2024 13: 05 PM
Slider నల్గొండ

రైతు వేదిక నిర్మించాలని కలెక్టర్ కు వినతి

#NalgondaCollector

రైతులకు వెసులుబాటు కల్పించడానికి, వారి వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి కొన్ని గ్రామాలు కలిపి క్లస్టర్లుగా చేసి  రైతు వేదికలను ఏర్పాటు చేయాలని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇందుకుగాను రైతు వేదికల భవన నిర్మాణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే చింతపల్లి మండలం గొడ కొండ్ల గ్రామపంచాయతీ క్లస్టర్  కింద 9 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే తక్కళ్ళపల్లి గ్రామ పంచాయతీకి మదనాపురం క్లస్టర్ రైతు వేదికగా ఉన్నందున ఉమా పురం, తక్కలపల్లి, రోడ్డు గడ్డ తండా, చాకలి శేరిపల్లి తదితర గ్రామాల రైతులకు అసౌకర్యంగా ఉంది.

దూరంగా ఉన్న రైతు వేదిక మాకు వద్దు

ఈ నాలుగు గ్రామాలకు మధ్య దూరం రెండు  కిలోమీటర్ల  మాత్రమే ఉన్నందువల్ల మదనాపురం రైతు వేదికకు వెళ్లాలంటే 10 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంది. అందువల్ల మనపురం రైతు వేదిక ఆమోదయోగ్యంగా లేనందున తక్కల్లపల్లి గ్రామ పంచాయతీ ని క్లస్టర్ చేసి రైతు వేదిక ను నిర్మించాలని కోరుతున్నారు.

ఈ మేరకు రోటి గడ్డ తండా సర్పంచ్ పద్మ ఫుల్ సింగ్ నాయక్’ తక్కల్లపల్లి సర్పంచ్ ముద్దం సత్యమ్మ మారయ్య గౌడ్, చాకలి శేరిపల్లి సర్పంచ్ మల్లమ్మ ,ఉమా పురం  సర్పంచ్ కేషగోని సత్తయ్య గౌడ్, తక్కళ్ళపల్లి గ్రామ నాయకులు ముద్ధం రవీందర్ గౌడ్ తదితరులు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా వ్యవసాయ అధికారి కి అందించారు.

Related posts

‘క్షీర సాగర మథనం’ పాటకు పట్టాభిషేకం!!

Satyam NEWS

కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ

Satyam NEWS

జాతర

Satyam NEWS

Leave a Comment