Slider ప్రత్యేకం

కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ

#shabbirali

కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ జరిగిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి, క్యాసంపల్లి తాండ . రాఘవపూర్, గర్గుల్, ఇస్రోజివాడి గ్రామాల్లో పాద యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలపై ఛార్జ్ షీట్ విడుదల చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేల కోట్ల అవినీతితో నిర్మితమైందన్నారు. అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని ప్రాజెక్టుల కోసం గుంజుకున్న రైతుల భూములకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదన్నారు.

అలవికాని హామీలను ఇచ్చిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేసారని పేర్కొన్నారు. కేజీ నుండి పీజీ ఉచిత విద్య, పోడు భూములకు పట్టాలు, దళిత గిరిజనుల కుటుంబానికి 3 ఎకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, రైతులకు రుణమాఫీ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. అభయ హస్తం, స్త్రీ నిధి, వడ్డీ లేని రుణాల విడుదల కోసం, పోరాటం చేస్తామని, గత 4 ఏళ్లుగా మహిళా సంఘాలకు రావలసిన వడ్డీ లేని రుణాల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఇవ్వడం లేదన్నారు. మహిళా డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని, మహిళలకు రావలసిన అనేక పథకాలు ప్రభుత్వం ఎత్తి వేసిందన్నారు.

పేద ప్రజలకు విద్యుత్ బిల్లు మోత మోగుతుందని, బిల్లులు కట్టడానికి డబ్బులు లేవంటే ఏసీడీ చార్జీలు వసూలు చేస్తున్నారని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీడీ కార్మికులను రోడ్డుపై తీసుకువచ్చి ఉపాధి లేనివారిగా చేసే కుట్ర జరుగుతుందన్నారు. బీడీ కార్మిక రంగాన్ని బీడీ వ్యవస్థనే రద్దు చేసే ఆలోచన జరుగుతుందని చెప్పారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అర్హులందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని, ఒకే ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇస్తామని చెప్పారు.

Related posts

పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

Analysis: కరోనా కంగనా మధ్యలో శివసేన

Satyam NEWS

ట్రిబ్యూట్: మరణం లేని మహా శక్తి అంబేడ్కర్

Satyam NEWS

Leave a Comment