25.7 C
Hyderabad
May 18, 2024 03: 38 AM
కవి ప్రపంచం

పాములపర్తి కీర్తి

#Jasashri Janardhan Kudikala

పాములపర్తి పొందిన కీర్తి

భరతజాతి దీప్తి భావితరం స్ఫూర్తి

విద్యారంగములో మునిగితేలినాడు

రాజకీయరంగములో రాటుతేలినాడు

బహుభాషాకోవిదుడు రాజకీయవిశారదుడు

ప్రధానమంత్రి పదవికే ప్రశంస తెచ్చినాడు

ప్రపంచ పోకడలను పరిశీలన చేసినాడు

ప్రజల సేవ కొరకు సంస్కరణలు తెచ్చినాడు

క్లిష్టమైన స్థితిలో విశిష్ట సేవలంచించినాడు

ప్రధాన మంత్రి పదవిలో అపరచాణక్యుడు

చదివి చదివి ఎదిగినాడు పాములపర్తి

ఎదుగుతూనే ఒదిగినాడు పాములపర్తి

ప్రజల మనసు గెలిచినాడు పాములపర్తి

ప్రధానమంత్రు లందరికీ అతడే స్ఫూర్తి

తెలుగుజాతి జ్యోతిరా పి.వీ

తెలుగుజాతి ఖ్యాతిరా పి.వీ

తెలుగు రాచఠీవిరా పి.వీ

తెలుగుతల్లి కెప్పుడు సదా చిరంజీవి

జనశ్రీ జనార్ధన్ కుడికాల, హన్మకొండ, వరంగల్ అర్బన్, చరవాణి: 9703275050

Related posts

తిరుగుపయనం

Satyam NEWS

శ్రమదీపాలు

Satyam NEWS

భారతరత్నం పీ.వీ

Satyam NEWS

Leave a Comment