40.2 C
Hyderabad
April 28, 2024 18: 41 PM
Slider కవి ప్రపంచం

తిరుగుపయనం

#Manjula Surya New

భువిని ఏలిన సుస్వరాల సామ్రాట్టు

దివికి ఏగెను పయనమై

కమనీయమైన పాటలతో

గాత్రమాధుర్యాన్ని అందించిన

గానగంధర్వం

వీరోచితంగా పోరాడి అలసి సొలసి

నేడు ఓడిపోయెను

దేశమే గర్వించదగ్గ

సంగీత దిగ్గజం

గొంతు నేడు మూగబోయెను

తీయగా పాడుతూ

స్వరాభిషేకం చేసిన

గానామృతం గంధర్వలోకానికి

తరలిపోయెను

సినీజగత్తులో

ప్రతి పాత్రకు చేసెను సమన్యాయం

అయినా గాత్రానికే వేసెను సింహాసనం

పదహారు భాషల్లో

ఒలికించెను తన గాత్రం

గోండు భాష వాటిలో ప్రత్యేకం

తేనెలోని మాధుర్యం

పూలలోని సుగంధాల

అపూర్వ సమ్మిళితం

ఆ గానామృతకలశం

తనకు తనే సాటిగా

తన తోటివారికి ధీటుగా

తన తర్వాతి తరానికి బాటగా

ప్రతి పాటలో పరకాయప్రవేశమే

ప్రతి బాణీలో పంచప్రాణమే

గొంతు దాటిన  ప్రతి పాట

కోట్లజనుల గుండెలను శ్రుతి చేసిన మీట

ఉంటావు ఎప్పటికీ

అభిమానుల నోట పాటగా

అప్పటికీ ఇప్పటికీ మరెప్పటికీ

మరుపురాని మరిచిపోలేని

మా బాలుగా

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

మార్చి మూడో వారానికి విశాఖ నుంచి పాలన?

Bhavani

ఢిల్లీకి వెళుతున్న వై ఎస్ షర్మిల

Satyam NEWS

జగన్ రెడ్డి ఉగాది కనుక: బాదుడే బాదుడు

Satyam NEWS

1 comment

Yssubramanyam September 29, 2020 at 4:44 AM

అద్భుతమైన మాటలు

Reply

Leave a Comment