31.2 C
Hyderabad
May 18, 2024 14: 48 PM
కవి ప్రపంచం

అభివృద్ధి విధాత

#Machidi Santoshgowd

లక్నేపల్లి లో మొలచి వంగర లో వెలసి

పాములపర్తి గా ఎగిసి ప్రఖ్యాతిని నెరిసి

మంథనిలో నిలిచి దేశాన గెలిచి

లౌక్యరాశి గా మెలగి జ్ఞాన జ్యోతియై వెలిగే

వందేమాతరం అంటూ జాతీయతను కోరి

హైదరాబాద్ విముక్తి కై ప్రాంతీయతను చాటి

పరాయి పాలనను నిరసించి

స్వపరిపాలన కొరకై పరితపించి

న్యాయ విద్యను చదివి జర్నలిస్టుగా మారి

కాకతీయ  అనేటి పత్రికను  స్థాపించి

విజయ పేరుతో కలాన్ని ఝలిపించి

ఆత్మగౌరవ పోరాటాన్ని నిలిపి నాడు.

భువనము పై వెలసిన భూవిరాళ దాత

భూసంస్కరణల స్పూర్తి ప్రదాత

ఊహకందని ఆర్థిక సంస్కరణల ప్రధాత

అవధి కందని అభివృద్ధి విధాత

ప్రతికూల పరిస్థితులకు అనుకూలుడు

సంకీర్ణ ప్రభుత్వానికి ధీశాలుడు

పంచవర్ష దిగ్విజయ ప్రధాని

పరిపాలనాదక్షతలో చుక్కాని

దక్షిణాది తొలి దేశ ప్రధాని

నిరాడంబర జీవితానికి ఆదర్శ జీవి

అపర చాణక్య అభ్యుదయ మేధావి

బహు భాష కోవిద అసాధారణ భావ ధ్వని

మాతృభాష మమకారపు మౌనముని

పరభాష అనువాద సాహిత్యపు జ్ఞానఖని

సహస్ర పణ్ తో సాహిత్య శిఖర మై

సాహిత్య అకాడమీ పురస్కారం తో మెరిసి

తన ఆంతర్యానికి అక్షరరూపం ఇచ్చి

లోపలి మనిషి గా లోకాన వెలిసినాడు

-మాచిడి సంతోష్ గౌడ్, మంథని, చరవాణి: 9948351138

Related posts

జై శ్రీ రామ్

Satyam NEWS

ఘనత

Satyam NEWS

ధీర

Satyam NEWS

Leave a Comment