34.2 C
Hyderabad
May 14, 2024 21: 09 PM
కవి ప్రపంచం

అలుపెరుగని బాటసారి

#Anisetti Satishkumar

కాకతీయులు ఏలిన ఓరుగల్లులో ఉదయించినారు,

తెలంగాణ గడ్డపై నడయాడిన అలుపెరుగని బాటసారి,

నిజాం పాలనను విద్యార్థి దశలోనే వ్యతిరేకించిన ధైర్యవంతులు,

రాజకీయాలలో రాణించినా సాహిత్యాన్ని వదలని సాహితీపిపాసి,

అటు రాజకీయాలను ఇటు సాహిత్యాన్నీ ఏలిన సవ్యసాచి,

పదిహేడు భాషలను అనర్గళంగా మాట్లాడే బహుభాషావేత్త,

విశ్వనాథ వారి వెయిపడగలు నవలను అనువదించారు,

‘సహస్రఫాణ్’ నవలతో సలక్షణంగా లిఖించినారు,

అనువాదమే చేశారు కానీ అనుకరణ ఏచోట కానరాదు,

దానికి సాహిత్య అకాడమీ పురస్కారమే వచ్చి వీరిని వరించింది,

రోజురోజుకు అకృత్యాలకు గురౌతున్నారు ఆడవారు,

‘అబల జీవితం’ అర్ధమయ్యేలా అనువదించి చూపినారు,

‘ఇన్ సైడర్’ పేరుతో వారి ఇన్నర్ సైడును అవిష్కరించినారు,

‘గొల్ల రామవ్వ’ కథతో తెలంగాణ సాయుధ పోరాటానికి జీవం పోసారు,

విజయ కలం పేరుతో విజయబావుట ఎగురవేసారు,

మరెన్నో వ్యాసాలు రాసారు మాన్యతను పెంచుకున్నారు,

ప్రధానిగా ఆర్ధిక సంస్కరణలు అవిష్కరించినారు,

భరతావని ఘనత అవనంత ఎలుగెత్తి చాటారు,

పి.వి. గారు తెలుగువారైనందుకు గర్విస్తాం,

తెలంగాణ వాడైనందుకు తెలంగాణ పునీతమైంది.

-అనిశెట్టి సతీష్ కుమార్, సిద్దిపేట, సెల్ : 9989353934.

Related posts

ఆ వెలుగులకే నా ప్రస్థానం

Satyam NEWS

స్థిత ప్రజ్ఞుడు పీవి

Satyam NEWS

వందనం

Satyam NEWS

Leave a Comment