అయోధ్యలో శ్రీరామ మందిరం
బాల రాముడి ప్రతిష్టతో
దేశంలో పండుగలన్నీ
ఒకేరోజు వచ్చేశాయి
ఉదయాన్నే ముంగిళ్ళన్ని
రంగురంగుల రంగవల్లికలతో నిండి పోయి
సంక్రాంతి పండగ దర్శనమివ్వగా
మధ్యాహ్నం రాముని పట్టాభిషేకం
శ్రీరామనవమిని తెస్తోంది
సాయంత్రం ఆనందడోలికల్లో
ప్రజలంతా వసంతోత్స్వవాలు
గుర్తుచేసుకుంటూ
రంగులుజల్లుకొని హోలీ పండుగను
జరుపుకుంటారు
చీకట్లు అలుముకొనే సమయానికి
ఇంటింటా ఐదు దీపాలు వెలిగించి
దీపావళి జరుపుకుంటారు
ఒకేరోజు హిందువులకు
పండుగలన్నీ సందడి చేయనున్నాయి
అయోధ్యా రాముడి ప్రతిష్టతో…
రాముని మీద భక్తితో
ఆనందాల వెల్లువలో అందరం కలిసి
పూజలు చేద్దాం
జై శ్రీ రామ్
జై జై శ్రీ రామ్ అంటూ
భక్తిపారవశ్యంలో మునిగి తేలుదాం
దేవలపల్లి సునంద, 9291599562