30.7 C
Hyderabad
May 5, 2024 03: 29 AM
కవి ప్రపంచం

ప్రధానమైన నూరు పాఠాలు

#Kandali Raghavacharya

బహు భాషలను జిహ్వ పై

మధుర భాషణంగా వేదిక పై

వేల్పుల చేసిన మహా పండిత వరేణ్యుడు!

తెలుగు ఖ్యాతిని ప్రపంచాన

ఓరుగల్లు తోరణంగా ప్రతాపం

చేసిన స్వభాషాభిమాని !

విలువలెరిగిన రాజకీయ

ఎత్తుగడలతో దేశాన్ని 

అంతర్జాతీయంగా ఎవరెస్టు

శిఖరాయమానం చేసిన

అపర చాణుక్య ఘనుడు !

ప్రయోజన ప్రణాళికలు రచించి

దేశాన్ని అన్ని రంగాల

రంగ రంగ వైభవం చేసిన 

 మన ప్రధాన మంత్రి !

విద్యాప్రమాణాల ధారణగా

దేశంలో విద్యను తీర్చిదిద్దిన

మన దేశం పెద్ద బడి పంతులు !

మధ్యాహ్న భోజన పథకం

శ్రీకారం చేసి పేద బాలల

బడికి రప్పించిన ఆబాల గోపాల విద్యాతపస్వీ !

రైతు కుటుంబాన పుట్టిన వాడు

రైతు శోకం ఎరిగిన వాడు

పుట్టెడు పుట్టెడు ధాన్యం

పండేలా రైతుల నాగలికి

ఎన్నెన్నో రాయితీలు మొలకలెత్తించి నారు పోసిన

ఈ దేశపు రైతుల రారాజు !

ఆహా ! ఆడంబరమెరుగని 

లాల్చీ ఉత్తరీయల పంచెకట్టు

తెలుగు వెలుగుల ప్రధాని !

పాములపర్తి వేంకట నరసింహా రావు  శతజయంతి వేళ మన పూర్వ ప్రధాని

చరిత్ర పుటం పెట్టిన

నూరు పాఠాలుగా

మనకు అపూర్వం – ఆదర్శం ! 

– కందాళై రాఘవాచార్య, హైదరాబాద్, సెల్ నెం: 8790593638

Related posts

అమ్మ ఎప్పుడూ ఆశ్చర్యమే !

Satyam NEWS

జయహో జగజ్జననీ

Satyam NEWS

తెలుగు వత్సరం

Satyam NEWS

Leave a Comment