24.7 C
Hyderabad
May 18, 2024 22: 52 PM
కవి ప్రపంచం

శతాభివందనాలు

#Midde Muralikrishna

తెలుగునేలపై జన్మించిన రాజకీయ దురంధరుడు,

నిజాంను ధిక్కరించి ఆలపించారు వందేమాతరం,

స్వరాజ్య, హైదరాబాద్ విముక్తి పోరాటాల్లో పాల్గొన్న ధీరత్వం,

పలు శాఖల  అమాత్యులుగా సాధించారు అపార అనుభవం,

ఉద్దండులు ఎందరున్నా ఉత్తమంగా ఎంపికై,

విపత్కర పరిస్థితుల్లో స్వీకరించారు ముఖ్యమంత్రి పీఠం ,

వివాద రహితమైన వ్యక్తిత్వమే మూలకారణం,

భూగరిష్ట పరిమితి విధానాలు చేపట్టిన అభ్యుదయవాది,

అనూహ్య పరిణామాల మధ్య ప్రధానిగా ఎన్నికయ్యాడంటే,

 కుల ప్రాబల్యం, ఏ వర్గ ఆశీస్సులు లేని నిరాడంబరుడు కావడమే,

సంఖ్యా బలం లేని సంకీర్ణాన్ని,

సంపూర్ణ కాలం నడిపిన అపర చాణిక్యుడు,

విప్లవాత్మక సంస్కరణల పితామహుడు,

కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదిన వైతాళికుడు,

తీవ్రవాదుల పీచమణచిన  సాహసికుడు,

దౌత్య సంబంధాల సమున్నత ప్రతిభాశాలి,

బహుభాషా కోవిదుడైన సాహితీమూర్తిగా,

అందుకున్నారు కేంద్ర కేంద్ర సాహిత్య పురస్కారం,

బంధుప్రీతి లేని  నిష్పక్షపాత నాయకుడు,

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ,

నిష్కళంకుడిగా నిరూపితమైన తెలుగు తేజం,

తెలుగు వారెవరూ మరువలేని వ్యక్తి,

తెలుగువారి “వాడి “అయిన ఠీవి,

మన పి.వి. నరసింహారావు గారు,

శత జయంతి ఉత్సవాల వేళ వారిని,

మరొక్కమారు స్మరించుకుందాం.

మిద్దె మురళీ కృష్ణ, అనంతపురం, 9985590196

Related posts

ఓంకార నాదా

Satyam NEWS

పల్లవించెను గుణింతము శుభాకాంక్షలై

Satyam NEWS

మన  ఘన  వారసత్వం

Satyam NEWS

Leave a Comment