37.2 C
Hyderabad
May 2, 2024 11: 17 AM
Slider కవి ప్రపంచం

మన  ఘన  వారసత్వం

#sambhudamodarrao

ఆ.వె. అతి పురాతనమ్ము హైందవ సంస్కృతి

          సకల జనుల హితమె సమ్మతమని

          భిన్న సంస్కృతులకు పెన్నిధిగ నిలచి

          నట్టి ఘనత మనల మట్టి దయ్య .

ఆ.వె. వేద సంస్కృతి యన విస్తు పోయెను గదా

          జగతి యంత నేడు సత్య మఱసి

          పరిపరి విధములుగ పరిశోధనలు చేసి

          నిగ్గు దేల్చి నారు నిప్పు లాగ .

ఆ.వె. పరుల పైన దాడి ప్రకటించ లేదయ్య

          దాడి చేసి నపుడు తగిన బుద్ధి

          చెప్పి నార మయ్య చిత్తముప్పొంగగా

          ధర్మ మార్గమె మన దారి యెపుడు .

ఆ.వె.  అన్ని నియమములవి ఆహార సూత్రాలె

           పుణ్య పాపములని పూత పూయ

           భయము తోడ నైన పాటింతు రనియెడు

           నాశయమ్మె వారి యభి మతమ్ము.

ఆ.వె.  దేవ భాష యందు దివ్య సంస్కృతి నిధిన్

           దాచి పెట్టి నారు తర తరాలు

           పుట్ట గతులు లేవు పుట్టిన పుడమిపై

           దేవ భాష మాత దీను రాలు .

ఆ.వె.  పశ్చిమాన భాష ప్రతిభను గుర్తించి

           కంప్యుటీ కరణకు ఘనమనియెడు

           నిజము నఱసి వారు నిత్య శోధన తోడ

           మనకు చూపి నారు మనల ఘనత .

ఆ.వె.  “గీత “ బోధనమ్మె రాత మార్చు ననెడు

            సత్య మఱసె నేడు జగతి యంత

          “ గీత “ పేరు చెప్ప ప్రేతము లనురీతి

             గోల చేతు రయ్య కూళ గుంపు .

ఆ.వె.    బాదరాయణ ముని వరముగా మనకందె

             వేద ముపనిషత్తు విద్య లన్ని

             భారతమ్ము భాగవతము రామాయణా

             ది ఘన రచనలె మన ధనము సుమ్మి.

ఆ.వె. పంచ భూతములను పరమ భక్తిని కొల్చు

          భవ్య సంస్కృతి యది భారతాన

          మట్టి పుట్ట గుట్ట చెట్టు చేమలు నెల్ల

          దైవ సమము మనకు ధాత్రి యందు.

సీసమాలిక :-

        భాగ్య వంతులమన భారతాంబకు పుట్ట

                     భవ్య చరిత గల దివ్య ధాత్రి

        ఇచ్చిన మాటకు నిక్కట్ల పాలైన

                     ఆడి తప్పని రాజు మహితు డతడు

        నూర్గురు పుత్రుల నులిమి చంపిన గాని

                     బ్రహ్మ ఋషిగ నొప్పె వ్యాసు తాత

        గుణమె ముఖ్యము కాని కులము కాదెప్పుడు

                     దశకంఠు సతియె ఆదర్శ మనగ

        పడుకొన్న సమయాన పాంచాలి పుత్రుల.     

                     చంపిన ద్రౌణిని చంప బూన

        గురు పుత్రు డాతండు గురువుతో సమమని

                      ప్రాణ భిక్ష నిడగ పతుల వేడె

        పక్షి శరణు వేడ ప్రాణాలు కాపాడె

                      తొడ మాంస మొసగి పుడమి ధవుడు

        దివిషదుల్ వేడగా దేహమునె త్యజించె

                       ముని దధీచి నిరత పూజ్యు డౌర

ఆ.వె. మనల సంస్కృతి కివి ఘన ఉదాహరణాలు

          ఏమి త్యాగ బుద్ధి యెంత తాల్మి

          వారసత్వ నిధికి వారసుల మనగ

          మనల నడవడికన కనగ లేమె.

శంభు దామోదర రావు (వశిష్ఠ), యాదగిరి నగర్, సంతోష్ నగర్ హైదరాబాదు – 500059, చరవాణి – 8074830704

Related posts

కొల్లాపూర్ మున్సిపాలిటీలో రెండవ కరోనా కేసు

Satyam NEWS

ఎమ్మెల్యే రోజాపై పెద్దల రాజకీయ కుట్ర

Satyam NEWS

టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వలసలు

Satyam NEWS

Leave a Comment