27.7 C
Hyderabad
May 14, 2024 03: 40 AM
Slider కవి ప్రపంచం

ఓంకార నాదా

#K.Haranath New Photo

మనోవిజ్ఞాన మంజునాదా

మార్తాండ తేజోమయ ప్రభావితుడా

పంచలోహ విగ్రహ రామానుజా

జయహో జయహో

నా గుండె గుడిలో నా భక్తి బడిలో

నా శక్తి వొడిలో నా యుక్తి మదిలో

నా సత్య సాహిత్య నిత్యార్చనములో

కొలువైయున్న అపర సాకేతుడదిగో

ఆనంద తత్వమే ఆద్యంత సత్యము

నిత్యసత్య స్వరూపమే సుగుణ బ్రహ్మత్వము

ఎలుగెత్తి చాటిన నిలువెత్తు ఘనుడా

కాంచీపుర నివాసా కాంతిమతి పుత్రుడదిగో   

ఏది మార్గమేదిగమ్యము

ఏది సత్యమేదసత్యము

తత్వాలు, తర్కాలు వేదనాదాలు

ఎరుకపరిచిన వైష్ణవ శంఖారవపు

ఓంకార నాదు డదిగో

గిరిశిఖరమై హరితత్వమై

అవతరించిన అవతారనాదా

పరిపూర్ణ సహస్రాబ్ది దీర్ఘయాగ

మానవ నూతన జీవన మార్గదర్శుండదిగో

సుమసుగంధ పరిమళ

సుమాలతో అలంకృతుడవైన

నవ్యాంకుర దివ్యప్రబోధకుండదిగో

మనో విజ్ఞాన మంజునాదా

మార్తాండ తేజోప్రభావితుడా

జయహో జయహో

జయ జయ జయ జయహో రామానుజ

కె.హరనాథ్, 9703542598, హైదరాబాద్ పాతనగర కవుల వేదిక

Related posts

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

Sub Editor

‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ ఉద్యమ గోడ పత్రిక ఆవిష్కరణ

Satyam NEWS

‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ చిత్రం ‘డిజె టిల్లు’ టీజర్ విడుదల

Satyam NEWS

Leave a Comment