24.7 C
Hyderabad
May 18, 2024 23: 10 PM
కవి ప్రపంచం

పీవీ-స్ఫూర్తి

#Parankusam Raghunarayana

అపార అనుభవశాలి నిరాడంబరమైన ఆహార్యం

బహుభాషా కోవిదుడు

తెలుగు భాషాభిమాని మన పివి

తెలుగునేల వెలసిన ఓ.. ఆణిముత్యం

రాజకీయ చతురత కలిగిన ఓ..వెలుగు తేజామృతం

రాజకీయ చక్రవ్యూహంలో  రాణించిన మహా దిగ్గజం

సమస్యల సాధనలో ఘనత వహించిన మహాసాహసి

మన తెలంగాణవాడుగా  పుట్టడం మనకు ఓ గర్వకారణం

అనేకానేక  ఒడిదుడుకుల నడుమ  ప్రభుత్వాన్ని నెట్టుకురావడం

ఓ  అసాధారణ సాహసోపేతo

రాజకీయ వారసత్వం లేని కుటుంబం నుంచి

దేశం గర్వించే స్థాయికి. మహోన్నత పదవితో

పరిణతి చెందిన రాజకీయ దురంధరుడై

సాహసోపేత నిర్ణయాలతో ధీరోదాత్తుడై

ప్రపంచ దేశాలకు తలమానికoగా 

ఆయన రూపొందించిన ఆర్థిక సంస్కరణలు

దేశరాజకీయ చరిత్రలోనే  ఆయనది విశేష పాలన

చారిత్రక నేపథ్యాల సురచిత పరిశోధన

చాటినాడు దేశ ఔన్నత్య

కీర్తిజయ కేతనాన్ని

పెంచినాడు ప్రతి పక్షం పెను  సవాళ్ల సంకెళ్లను

దక్షిణాది నుండి తొలి భారత ప్రధాని పీటం అధిరోహించిన

గొప్ప అనుభవశాలి మన పివీ

మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పరిపాలించడం

ఓ చారిత్రాత్మకం!

అపార రాజకీయ పరిణతికిది నిదర్శనం

భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు

హైదరాబాద్ విముక్తి పోరాట దార్శనికుడు

రాజకీయ నేపథ్యాన్ని కొనసాగిస్తూనే

సమాంతరంగా.. సాహిత్యాభిమానిగా

గొప్ప పురస్కారం పొందాడు

జర్నలిజంతో కొనసాగిన ఆయన ప్రస్థానం

ఖండాంతరాలకు ఎదిగి  జగద్విజేత ఐనాడు

బహు జనుల హితం ఆయన అభిమతం

ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం

– పరాంకుశం రఘు నారాయణ, తొర్రూరు, మహబూబాబాద్, చరవాణి :9949749987

Related posts

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే!

Satyam NEWS

అచ్చమైన పల్లె సంక్రాంతి

Satyam NEWS

అంబాసిడర్

Satyam NEWS

Leave a Comment