27.2 C
Hyderabad
May 18, 2024 21: 29 PM
కవి ప్రపంచం

పి.వి మన ఠీవి

#Ashokachakravarthi Neelakantham

కౌటిల్యుని అర్ధం

చాణిక్యుణి మర్మం

భారతీయుని ధర్మం

పి.వి ‘జీవనయానం.

దేశ ఆర్ధికానికి పరిపుష్టి

రాజకీయ చోదన యుక్తి

అసాధ్యం సుసాధ్య రక్తి

ప్రధానిపాత్రన అతడొ శక్తి.

నిజాం వ్యతిరేక యోధుడై

స్వాతంత్ర్య సమర యోధుడై

రాజకీయ చతుర్ముఖుడై

ప్రధానిగా తొలి తెలుగు వాడై.

వరంగల్లున పుట్టి

వంగరలో పెరిగి

విద్యాధికుడై ఎదిగి

మంత్రి ముఖ్యమంత్రి

దేశానికి ప్రధాన మంత్రి.

ఎంత ఎదిగిననూ

మూలాలు మరవక

అలిసే వయస్సున

ఎగిసిన కెరటమా!.

తెలుగు గడ్డన ప్రస్థానం

తెలుగు నేలన విజయం

తెలుగు నాట నాయకత్వం

తెలుగు నాడి ఎర్రకోట పతాకం.

‘చే’యిచ్చిన వారే అవమానిస్తే

తెలుగు నేలన దాగిన మృతమై

జ్ఞాపకాల దొంతరలో దృవ తార

పాములపర్తి.వేంకటనరసింహరావు. 

అతడే పి.వి మన ఠీవి

అశోక్ చక్రవర్తి నీలకంఠం, బడంగపేట, రంగారెడ్డి జిల్లా 9391456575

Related posts

రండి రండి ప్లవ గారూ!

Satyam NEWS

సింహ వాహిని-గంభీర రూపిణి

Satyam NEWS

యోగ నరసింహుడు

Satyam NEWS

Leave a Comment