27.7 C
Hyderabad
April 26, 2024 06: 51 AM
Slider కవి ప్రపంచం

సింహ వాహిని-గంభీర రూపిణి

#Krishnamurthy Gowd

లష్కరులో నెలకొన్న ఉజ్జయిని మహంకాళికా

లాల్ దర్వాజాలో కొలువైన సింహవాహికా

ఆషాడ మాసాన నిను వేడుకతో కొలిచేము దేవికా

దుష్ట శక్తులను చెండాడే ఓ అపరకాళిక

ముంగిట్ల ముగ్గులతో మామిడి తోరణాలతో

పూల అలంకరణలు పసుపు కుంకుమలతో

అమ్మా నిను పూజింతుము భక్తి పారవశ్యముతో

బోనాలను అర్పించెదము కాపాడమంటూ అనురక్తితో

యాప ఆకుల వరుసలు నుదుట సింధూరంతో

కాళ్లకు పారాణి శివ సత్తుల ఆటపాటలతో

పోతు రాజు విన్యాసాలతో అమ్మ నిను వేడెదము

నీకు మొక్కులు ఆర్పించెదము మము కాపాడమంటు నీకు కేమోడ్చెదము

పాడి పంట పరిశ్రమ విద్యా వైద్య అభివృద్ధిలో

రవాణా వస్త్ర రంగాల ప్రజ్వలనతో

పాపములను  మన్నించి ఊరు వాడ సల్లంగచూడమ్మ

లోకాలను కాపాడే జగన్మాత నీవమ్మా

కరోనా ఇపుడు మమ్ము కలవర పెడుతుంది

కనికరములేకుండా మా ప్రాణాలతో ఆటాడుతుంది

అడ్డు తనకు లేదంటు హద్దుమీరి పోతుంది

అడ్డుకో ఓతల్లి నీబిడ్డల కాపాడా!మరవమేపుడు తల్లి నిరతము నిను వేడా!

జక్కు కృష్ణమూర్తిగౌడు, తెలుగు భాషోపాధ్యాయుడు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హుజురాబాద్, కరీంనగర్. చరవాణి: 9912328949

Related posts

INTUC ఆధ్వర్యంలో ఘనంగా కార్మికుల పండుగ

Satyam NEWS

రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలి: కాట్రగడ్డ ప్రసూన

Satyam NEWS

25న హరిత హారం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment