24.7 C
Hyderabad
May 13, 2024 03: 30 AM
కవి ప్రపంచం

యోగ నరసింహుడు

#T.Srirangaswamy

అతను మౌనమునకు ప్రతిబింబం

మౌని అంటే మౌని కాదు

నిశ్శబ్ద చైతన్య వీచిక

తన అంతరాంతరాన్ని

సమాజంకోసం వెచ్చించినా

తన ఆంతరంగితకుమాత్రం

కుదించుకున్నా… సామాజికతకు,

సంఘజీవన సాఫల్యతకు

సంపుష్టి చేకూర్చడానికి

నిరంతరాణ్వేషణాధీషుడు

కాముకుడతడు.

భారతీయ జీవనమూలాలకోసం

తన ఆలోచనా నైశిత్యాన్ని

భావి తరాలకు ఏతమెత్తినా

చుట్టూతాఉన్న నవగ్రహాలపై

అసంతృప్త, ఆగ్రహతాపాలను

అననుకూల సమయాలలోను

‘లోపలి మనిషి’లో నిక్షిప్తంకావిస్తూ

జనజీవన సౌభ్రాతృత్వాలకు

ఆయత్తమవడం నా కర్తవ్యం.

అయినా…నేను ఉగ్రనరసింహుడనుకాను

కేవలం యోగనరసింహుడినే

వేయిపడగల వారసుడిని,

వేలవేల హిందూ దార్శనికతకు

వారసుడిని…కాకతమ్మ మూలాన్ని

అనుకున్న నిష్కాముకుడతడు

డా।।టి.శ్రీరంగస్వామి, హసన్ పర్తి, వరంగల్,  9949857955

Related posts

సంభవామి యుగే యుగే

Satyam NEWS

మేమిట్లాగే ఉంటాము గాంధీ ‘జీ’

Satyam NEWS

మనిషి బతికేయాలంతే

Satyam NEWS

Leave a Comment