34.2 C
Hyderabad
May 10, 2024 11: 13 AM
కవి ప్రపంచం

లాక్షాయణుడు

#Avadhanula Kavitarani

బహు భాషా కోవిదుడు తెలుగునాట పుట్టినాడు

రంగారావు రుక్మిణి గార్ల ముద్దుబిడ్డగ ఇంతింతై ఎదిగాడు

నిజాం దొరలు పాలనలో విద్య కూడా పాపమంటే

ధిక్కరించి పై చదువులు పంతంతో చదివినవాడు

వంగర దత్తపుత్రుడైన పివీ ఠీవి రాజధానికేగింది

రాజకీయ బరిలో అపర చాణక్యుడిగా అవతారం దాల్చి

తొలి తెలుగు బిడ్డగా దేశానికి ప్రధానిగా ఏలినాడు భారతావని

బహుభాషా కోవిదుడు స్థితప్రజ్ఞ లాక్షణ్యుడు

ఆర్థిక లావాదేవీలేమిటి ఎన్నెన్నో రంగాలను అవలీలగా సరిచేసిన

పాములపర్తి జ్ఞానతృష్ణకు నిదర్శనం వేయిపడగలు తర్జుమా

సాహిత్య పిపాసి ఆయన రచనల్లో విచక్షణా గాంభీర్యం

ఏ పీఠమెక్కినా అందుకు న్యాయం చేస్తూ

గొప్ప జ్ఞాననిధి గా

స్నేహశీలి గా

రాజకీయ ద్రష్టగా

నిరాడంబర మూర్తిగా

చిరునవ్వులు చిందించే ప్రియతమ ప్రధాని గా

తెలుగు వారి గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్న బ్రాహ్మణ తేజం పీవీ నరసింహారావు గారు

ఈనాటికీ ఏనాటికీ ఆయన చిరస్మరణీయుడు.

-అవధానుల కవితారాణి, వేములవాడ, రాజన్న సిరిసిల్ల, చర వాణి : 8897936833

Related posts

అమ్మోరుతల్లి

Satyam NEWS

బోనాల పండుగ

Satyam NEWS

వందన సమర్పణ

Satyam NEWS

Leave a Comment