28.2 C
Hyderabad
May 17, 2024 13: 51 PM
కవి ప్రపంచం

తెలుగు తేజం

#Veggalam Ushashree

వంగరలో వెలసిన తెలుగు తేజం!

ఇంతింతగా ఎదిగి

ఢిల్లీ సింహాసనమునకు వన్నె తెచ్చిన ఉద్దండ పండితుడు

సంకీర్ణ ప్రభుత్వాన్నీ సంపూర్ణంగా ఏలిన అపర చాణుక్యుడు !

లోపలి మనిషే అయినా…

బహుముఖ ప్రజ్ఞాశాలిగానూ

బహుభాషా కోవిదుడుగానూ వినుతికెక్కి

ప్రపంచ ఖ్యాతి గడించిన ఉత్తమ ఆర్థిక వేత్త!

తన సమర్థతతో పలు పదవులకే

వన్నె తెచ్చిన మిత భాషి!

రచనా రంగంలోనూ అందె వేసిన

చేయైన నిరాడంబర మేథావి!!

బురదంటని మహనీయుడే అయినా

ఏ స్మారక చిహ్న గౌరవం దక్కని మన పి. వి

పి. వి. అంటేనే మన తెలంగాణ ఠీవి!

వెగ్గలం ఉషఃశ్రీ

Related posts

నాడు- నేడు

Satyam NEWS

ఓ విఘ్నరాజా…

Satyam NEWS

హిందువుగా జీవించు

Satyam NEWS

Leave a Comment