26.7 C
Hyderabad
May 3, 2024 08: 04 AM
Slider మహబూబ్ నగర్

కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించిన కౌన్సిలర్స్

kollapur councilars

కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో కౌన్సిలర్స్ వార్డు ప్రజలకు కరోనా వైరస్ వ్యాధిపై అవగాహన కల్పించారు. మంగళవారం సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కౌన్సిలర్స్ బుధవారం నుండి రంగంలోకి దిగారు.

కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఆరోవ  వార్డు కౌన్సిలర్ మేకల రమ్య నాగరాజు, పదవ వార్డు కౌన్సిలర్ షేక్ రహీం పాషా,13వ వార్డు కౌన్సిలర్ మేకల శిరీష కిరణ్ యాదవ్ తమ తమ వార్డులలో గడప గడపకు తిరుగుతూ కరోనా వైరస్ వ్యాధి ఫై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు.

రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తుంది, బయటికి ఎవ్వరు రాకూడదని కౌన్సిలర్ మేకల శిరీష కిరణ్ యాదవ్ వార్డు ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపును తూచా తప్పకుండా పాటించి ఇంట్లో నుండి ప్రజలు ఎవ్వరు బయటికి రాకూడదని తెలిపారు.

అదేవిధంగా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇంట్లో నుండి ఒకరు బయటికి రావాలన్నారు. ముఖ్యమంత్రి పిలుపును ప్రతి ఒక్కరు పాటించాలని ఆరోవ వార్డు కౌన్సిలర్ మేకల రమ్య నాగరాజు ప్రజలకు తెలియచేశారు. ప్రపంచంలో కరోనా వైరస్ వ్యాధి నుండి మరణాల సంఖ్య పెరిగిందన్నారు.

నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇంట్లో నుండి ఒకరు మాత్రమే  వెళ్ళలన్నారు. త్వరగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. రాష్ట ఆదేశాల మేరకు ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని పదోవ వార్దు కౌన్సిలర్ షేక్ రహీం పాషా వార్డు ప్రజలకు తెలియచేశారు.

ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తుందని ఆయన అన్నారు. వార్డు ప్రజలు అప్రమతంగా వుండాలని షేక్ రహీం పాషా తెలిపారు. కౌన్సిలర్స్ తో పాటు స్పెషల్ ఆఫీసర్స్ భగవాన్, జమిర్, ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపిలో రాజ్యాంగ ఉల్లంఘన వ్యాఖ్యలకు కట్టుబడిన హైకోర్టు

Satyam NEWS

రాష్ట్ర గవర్నర్ కు రేవంత్ రెడ్డి ఆవేదనాభరిత లేఖ

Satyam NEWS

కీసర ఎమ్మార్వో: వామ్మో ఇది అవినీతి అనకొండ

Satyam NEWS

Leave a Comment