28.2 C
Hyderabad
May 17, 2024 11: 49 AM
Slider ప్రత్యేకం

సుప్రీంకోర్టు లో జగన్ ప్రభుత్వానికి ఇంకో ఎదురుదెబ్బ

#Y S Jagan

మూడు రాజధానుల చట్టంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య బెంచ్ ఆగస్టు 4వ తేదీన అధికార వికేంద్రీకరణ చట్టంపై ముందుగా స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ తర్వాత ఆగస్టు 14కు తర్వాత ఆగస్టు 27 వరకూ పొడిగించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ షా లతో కూడిన బెంచ్ నిరాకరించింది.

ఈ దశలో తాము జోక్యం చేసుకోవడానికి సుముఖంగా లేమని వారు స్పష్టం చేశారు. రోజూ వారీ ప్రాతిపదికన రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే కేసును విచారించేందుకు సిద్ధంగా ఉన్నదని, అందువల్ల కేసును త్వరితగతిన పూర్తి చేయాలని మాత్రమే తాము హైకోర్టును కోరుతున్నామని వారన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ రద్దు చట్టం, అధికార వికేంద్రీకరణ చట్టాటల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ఆగస్టు 4న స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులకు చట్టబద్ధత లేదని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అడ్వకేట్ మెహఫూజ్ నక్వి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న రాజ్యాంగబద్ధమైన అధికారాలను హైకోర్టు ఉత్తర్వులు ప్రశ్నించేవిగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది.

ఈ కేసుకు సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్ లు వేరు వేరు సందర్భాలలో ఈ కేసును వినేందుకు నిరాకరించారు. ఇప్పుడు తాజా గా కేసు విన్న బెంచ్ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

Related posts

విపక్షాలు అన్నీ ఎక్కతాటిపైకి రావాలి

Bhavani

మాదలలో రూ.30.30 కోట్ల సంక్షేమ సిరులు

Bhavani

నరసరావుపేట లో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు

Bhavani

Leave a Comment