27.7 C
Hyderabad
April 30, 2024 10: 56 AM
Slider గుంటూరు

మాదలలో రూ.30.30 కోట్ల సంక్షేమ సిరులు

సంక్షేమ పథకాల అమలులో ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి కోట్ల రూపాయల జమ చేసి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కిందని జలవనుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శనివారం పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామం లో గడపగడప కు మన ప్రభుత్వ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మూడేళ్లలో అందిన ఎన్నో సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా రూ.24.99 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.5.31 కోట్ల తో మాదలలో మొత్తం రూ.30.30 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి పనులు జరిగాయన్నారు.

ప్రభుత్వం ముదిరించిన పత్రాలు 280 నివాసాలు తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు. రైతు భరోసా ద్వారా 1441 మందికి రూ.5.46 కోట్లు, అమ్మఒడి ద్వారా 831 మందికి రూ. 3.40 కోట్లు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 499 మందికి రూ. 1.49 కోట్లు ,జగనన్న తోడు ద్వారా 62 మందికి రూ. 34.5 లక్షలు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 1447 మందికి రూ. 1.57 కోట్లు,డ్వాక్రా సున్నా వడ్డీ రుణాల ద్వారా 1656 మందికి రూ. 14.14 లక్షలు, క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 639 మందికి రూ. 10.85 లక్షలు,కాపు నేస్తం ద్వారా 66 మందికి 17.7 లక్షలు, వాహన మిత్ర ద్వారా 59 మందికి రూ. 16.08 లక్షలు, విద్యా దీవెన ద్వారా 398 మందికి రూ. 90.11 లక్షలు, వసతి దీవెన ద్వారా 222 మందికి రూ. 25.71 లక్షలు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 1278 మందికి 8.45 కోట్లు, సంక్షేమ సాయం అందిందని వివరించారు.

శాశ్వత వనరులకు రూ.5.31 కోట్లు

నాడు -నేడు పథకం మొదటి విడతలో పాఠశాల అభివృద్ధికి రూ.66 లక్షలు,నాడు -నేడు పథకం రెండో విడత రూ.23లక్షలు,14 వ ఆర్ధిక సంవత్సరంలో సిమెంట్ కాంక్రెట్ రోడ్ల పనులకు గాను రూ. 12.00 లక్షలు ,15 వ ఆర్ధిక సంవత్సరంలో మురుగు కాల్వల నిర్మాణ పనులకు గాను రూ. 14.95 లక్షలు పనులు జరిగాయి. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ భవన నిర్మాణాలకు రూ.1.69 కోట్లు మంజూరు కాగా సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి.నాడు నేడు రెండో విడతలో రూ 2.46 కోట్లు మంజూరయ్యాయి, పనులు జరుగుతున్నాయన్నారు. గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల మంజూరు చేస్తుందని గ్రామంలో రెండు సచివాలయాలకు రూ. 40 లక్షలు ఎమ్మెల్యే నిధుల నుండి మరోరూ. 20 లక్షలుమొత్తం రూ.60 లక్షలు మంజూరు చేస్తున్నానన్నారు. వీటి ద్వారా సిసి రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నామని అంబటి వివరించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సింగంశెట్టి కోటేశ్వరమ్మ ,ఎంపీటీసీలు గోగుల నాగ అంజిబాబు, చిన్న మహబూబ్,ఉప సర్పంచ్ సైదా, కానాల పుల్లారెడ్డి, మండల నాయకులు ఎంజీఆర్ లింగారెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, సిరిగిరి గోపాలరావు, రావిపాటి బసవయ్య, గోగినేని కోటేశ్వరరావు, అచ్యుత శివప్రసాద్, నక్క శ్రీను, ఎంపీడీవో పుట్టారెడ్డి, తహశీల్దార్ భవాని శంకర్, సచివాలయ సిబ్బంది, పలు గ్రామాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

లింగ వివక్ష త లేని సమాజం నిర్మించడమే లక్ష్యం

Satyam NEWS

మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

యాలివాహనం పై సౌమ్యనాధ స్వామి వారి గ్రామోత్సవం

Satyam NEWS

Leave a Comment