37.2 C
Hyderabad
May 6, 2024 11: 29 AM
Slider హైదరాబాద్

పద్మారావు గౌడ్ ను గెలిపించేందుకు ముందుకు రండి

#padmaraogoud

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా  సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్  కు మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎం.ఎల్.ఏ ముఠా గోపాల్ ఆధ్వర్యంలో  హెరిటేజ్ ఫంక్షన్ హల్ లో అన్ని డివిజన్ లకు సంబంధించి బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ తో బాటు ఈ సమన్వయ సమావేశానికి బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరైనారు.

భారీ మెజారిటీతో ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ ను గెలిపించుకుంటామని కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత ప్రకాష్, మాజీ కార్పొరేటర్లు ముఠా పద్మ, శ్రీనివాస్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకులు ముఠా జై సింహ, ఎడ్ల హరిబాబు యాదవ్, బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ ఎం.పి ఎన్నికలు పెద్ద సమస్య ఏం కాదు. గెలుస్తాం..

హైదరాబాద్ ను అనేక రంగాలలో అభివృద్ధి చేసుకున్నాం. ముఖ్యంగా ఇందిరా పార్కు నుండి వి.ఎస్.టి వరకు స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకున్నాం. బస్తి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బస్తి దవాఖానలను ఏర్పాటు చేసుకున్నాం. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లాంటి పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయినం. హైదరాబాద్ లో గత ప్రభుత్వ హయాంలో మంచినీళ్లు , విద్యుత్తు నిరంతరంగా ఉండేవి. కానీ ఇప్పుడు తాగు నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్క సారి నన్ను ఆశీర్వదించండి. అందరికి అందుబాటులో ఉంటూ మన సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తా…అని అన్నారు.

ఎం.ఎల్.ఏ ముఠా గోపాల్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలు మళ్ళీ బి.ఆర్.ఎస్ పార్టీ కె పట్టం కట్టారంటే మనం అర్థం చేసుకోవాలి కేటీఆర్ హైదరాబాద్ ని ఎంత అభివృద్ధి చేశారో. ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ ని గెలిపించే దిశగా ముందుకు కదలాలి. బిసి , ఎస్.సి , ఎస్.టి అందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మన నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చేలా ప్రతి కార్యకర్త ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు.

Related posts

సామాజిక సేవలో పిఎస్ఆర్ ట్రస్ట్

Bhavani

జీతాలు రాక జీవితాలు దుర్భరం

Bhavani

డోంట్ వార్న్ మీ : సిఎమ్ పదవికి రాజీనామా చేస్తా

Satyam NEWS

Leave a Comment