29.7 C
Hyderabad
May 6, 2024 03: 53 AM
కవి ప్రపంచం

అపర చాణక్యుడు

#Sanigarapu Rajamohan

మనసున్న వాడుమన నారసింహుడు

మానవతావిలువలమహనీయుడు

వంగరలోపుట్టి వరంగల్లోపెరిగినట్టి

నైజాంనెదిరించిననారసింహుడు

వందేమాతరం ఉద్యమనాయకుడు

సహస్రఫన్రచనతో సాహితీ శిఖరమెక్కినోడు

విజ్ఞాన సముద్ర వినయశీలి

బహుముఖ ప్రజ్ఞాశాలి

బహుభాషాకోవిదుడు

భారతాన్ని ఎలినాడు

తత్వ జ్ఞానసంపన్నతాత్వికుడు

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు

నవోదయ విద్యావెలుగులు పంచిన సూర్యుడు

రాజకీయ చతురత కలిగిన అపర చాణక్యుడు

అనేకపదవులను ఏలినఅందగాడు

ప్రధానమంత్రి పీఠం తన దరికిచేరిన రాజ్యాలక్ష్మి వరుడు

గొప్ప భూదాన కర్ణుడు

స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రవేశ పెట్టిన ధైర్యశాలి

ఆధునిక భారత రూపశిల్పి

శనిగరపు రాజమోహన్, కాజిపేట్, వరంగల్ సెల్: 9676950683

Related posts

వేయిపడగలెత్తిన మేధావి

Satyam NEWS

తెలుగు జాతి ఖ్యాతి

Satyam NEWS

జీవిత రాట్నం

Satyam NEWS

Leave a Comment