30.2 C
Hyderabad
May 17, 2024 21: 31 PM
Slider ముఖ్యంశాలు

ఆదివాసీలకు శాపంగా మారిన కేసీఅర్ పాలన

#adivasisamaj

కేసీఅర్ పాలన  ఆదివాసీలకు శాపంగా మారిందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పర్యటించి ఆదివాసీలల్లో చైతన్యం తీసుకురావడానికి తమ వంతు శాయశక్తుల కృషి చేస్తానని ఆదివాసి సమాజ్ పార్టీ అధ్యక్షుడు ముక్తి భాస్కర్ రావు అన్నారు. సోమవారం కాప్రా లోని  ఆదివాసి సమాజ్ పార్టీ హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో  గిరిజనులు అణిచివేతకు గురవుతున్నారని అన్నారు.

జల్, జమీన్, జంగిల్ ఆదివాసులకేనంటూ వచ్చిన అటవీ హక్కులు నేడు అమలు జరగడం లేదంటూ ఆరోపించారు.  గిరిజనుల యెక్క పోడు భూములపై రోజు రోజుకు ఆదివాసీలు అధికారాన్ని కోల్పోతున్నారని, కేసీఅర్ సర్కారు అటవీ హక్కుల చట్టాన్ని అమలు జరగకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని అన్నారు. కేసీఅర్ పాలన తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీలకు శాపంగా మారిందని అన్నారు. ఎల్.టి.ఆర్. చట్టం, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టం ఏజెన్సీ లో పటిష్టంగా అమలు జరగడం లేదని, ఇప్పటి వరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయాలని,ఏజెన్సీ లో ఆదివాసీ స్వయం పాలన రావాలని తెలియజేశారు.

ఆదివాసీ సమస్యల పరిష్కారాలు దుష్టిలో ఉంచుకొని గిరిజన, మేదావులు, నాయకులు, ఉద్యోగులు ఏకతాటిపై ముందుకు రావాలని పిలపునిచ్చారు. నియంతల వ్యవహరిస్తూ ఆదివాసీల హక్కులను కాలరాసెందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాల్సిందేనాని అన్నారు. మొత్తంగా ఆదివాసీ జాతి ఏకత్రాటి పైకి వచ్చి జాతి పరిరక్షణ కోసం కృషి చేయాలనీ ఆకాంక్షతో ఆదివాసీ సమాజ్ పార్టీ పని చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సమాజ్ పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి గనిబోయిన చింపిరయ్య, కల్తీ సత్యనారాయణ, సాంస్కృతిక కార్యదర్శి సుధా రాణి, గొంది వెంకటరమణ, మెట్ల పాపయ్య , బుగ్గ రామనాథం, ఈసం రవీంద్రబాబు, కారం రాము తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమా?

Satyam NEWS

కొత్త ఏడాది లో కొత్త జిల్లా ఏర్పాటుకు శ్రీకారం

Satyam NEWS

కాంగ్రెస్ సభకు పోలీసుల అనుమతి

Bhavani

Leave a Comment