తెలంగాణ కాంగ్రెస్ ఈనెల 17న తుక్కుగూడ వద్ద నిర్వహించనున్న విజయభేరి బహిరంగ సభకు రాచకొండ పోలీసులు అనుమతిచ్చారు. 25 నిబంధనలతో కూడిన అనుమతి ఇస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు.
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సభ నిర్వహణకుఅనుమతిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సభకు పదివేల మందికి మించకూడదని నిబంధన పెట్టారు. బహిరంగ సభ వల్ల సామాన్యులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు చూసుకోవాలని స్పష్టం చేశారు. ప్రేరేపిత వ్యాఖ్యలు చేయరాదని, రహదారులపై వాహనాలను పార్కింగ్ చేయరాదని నిబంధనలు పెట్టారు.