31.2 C
Hyderabad
May 18, 2024 15: 13 PM
జాతీయం

Analysis: భారతీయ జనతకు విశ్వాసపాత్రుడు

#NarendraModi

ఈ నెల 17 వ తేదీ భారత ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయజనతా పార్టీ అనేక కార్యక్రమాలు ప్రకటించింది. “సేవా సప్తాహ్” పేరుతో సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు 70 రకాల విలక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని దేశవ్యాప్తంగా ఉన్న పార్టీశ్రేణులకు  బీజేపీ కేంద్ర నాయకత్వం సూచించింది.

పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలలో ఇప్పటికే నరేంద్ర మోదీ సమకాలీన నేతలకంటే చాలా ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం బీజీపీ లో కానీ బీజేపీ యేతర రాజకీయ పార్టీలలో సైతం ప్రజాదరణ కోణంలో మోదీతో సరితూగగల నేతలెవ్వరూ లేకపోవడం గమనార్హం.

53 శాతం ప్రజలు మోడీ వైపే

తాజాగా ఇండియా టుడే,క్వారీ సంయుక్తంగా నిర్వహించిన  ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ అభిప్రాయ సేకరణలో సైతం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా 53 శాతం ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటించారు. కేవలం 13 శాతం ప్రజల  మద్దతుతో కాంగ్రెస్ నేత రెండోస్థానంలో నిలిచారు.

బీజేపీ పార్టీలో రెండోకీలక స్థానంలో అమిత్ షా ఉన్నారని సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనకు కేవలం 4 శాతం ప్రజలే మద్దతు తెలిపారు. ఒక ప్రక్క ప్రధాని మోదీ 70 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీజేపీ పార్టీ సంసిద్ధమవుతున్న వేళ రానున్న 2024 ఎన్నికలలో బిజెపి ప్రకటించే ప్రధానమంత్రి అభ్యర్థి విషయమై ఆ పార్టీ ఆంతరంగిక వర్గాలలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది.

2024 ఎన్నికలో ప్రజలు మళ్ళీ బీజేపీ కే పట్టంకడితే ప్రధాని అభ్యర్థి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.  పార్టీ నిబంధనలు మేరకు వయసు రీత్యా నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని పదవి చేపట్టే అవకాశం లేదని పార్టీవర్గాలు అంటున్నాయి.

ప్రజామోదం గల నాయకుడు మోడీ

2024 నాటికి మోదీకి 73 ఏళ్ళ వయసుకి చేరడమే ప్రధాన కారణం. నీ భారత దేశ రాజకీయ యవనికపై నరేంద్రమోదీ విశిష్ట స్థానం సంపాదించినట్లు వైరిపక్షం నేతలు కూడా అంగీకరించారు. 2014 ఎన్నికలలో సాధించిన విజయం బీజేపీకి అందివచ్చిన అవకాశం అయితే 2019 ఎన్నికలలో గెలుపు మోదీ నాయకత్వానికి లభించిన అత్యధిక ప్రజామోదం అని చెప్పవచ్చు.

2014-2019 పాలనలో మోదీ బీజేపీలో ఒక మేరునగధీరుడు. 2019 ఎన్నికలలో ఘనవిజయం సాధించి రెండోసారి ప్రధాని పదవి చేప్పట్టిననాటి నుంచి కేంద్రనాయకత్వ  పగ్గాలను ఒక చేతితో అత్యంత ప్రభావంతంగా నిర్వహిస్తూనే బీజేపీ పార్టీని సైతం పటిష్టపరిచేందుకు  కృషి చేశారు.

మోదీ తర్వాతి స్థానంలో ఉన్న అమిత్ షా

ప్రభుత్వాన్ని , పార్టీని సమాంతరంగా,సమర్ధవంతంగా ముందుకు నడిపించగల ఆవశ్యకత గుర్తించి ప్రధాని మోదీ అత్యంత సన్నిహితుడైన అమిత్ షా ను పార్టీలో, ప్రభుత్వం లో కీలక పదవులు కట్టబెట్టారు. మోదీ తరువాతి స్థానంలో ప్రస్తుత కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాని పదవి రేసులో ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

మోదీ-షా ద్వయం సాధించిన ఘనవిజయాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. కానీ….మోదీ వ్యక్తిగత చొరవ, ప్రదర్శించిన ధైర్యసాహసాలు, క్లిష్టపరిస్థితులలో తీసుకునే కఠిన నిర్ణయాలు ..సబ్ కా సాత్ – సబ్ కా వికాస్, ఆత్మనిర్బర్, స్వచ్ఛభారత్, మేకిన్ ఇండియా….వంటి అనేక కార్యక్రమాలలో మోదీ ముద్ర గాఢంగా ఉంటుంది.

అనర్గల వాక్చాతుర్యం మోడీ సొంతం

అనర్గళ వాక్చాతుర్యం, హావభావ ప్రకటన , సకలవర్గాల ప్రజలకు సులభగ్రాహ్యమయ్యే పదాలుపొందిక సమకాలీన రాజకీయ నాయకులలో సాటిలేని మేటి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కరోనాతో దేశం అనేక సమస్యలతో  అతలాకుతలమవుతున్న దుర్భరస్థితిలో సైతం ప్రధానిగా  నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలు అత్యధిక శాతం ప్రజలు హర్షించినవే కావడం గమనార్హం. 

ఎన్నో వివాదాస్పద సమస్యలు మోదీ పాలనలో పరిష్కారం కావడంతో ఆయన వ్యక్తిగత ప్రతిష్ట అనూహ్యంగా పెరిగింది. 2024 నాటికి ప్రధాని పదవికి మోదీకి ప్రత్యమ్నాయంగా వేరొకరిని ఊహించడం ఇప్పట్లో కష్టసాధ్యమేనని బీజేపీ అనుకూల మీడియా కూడా భావిస్తోంది. ఒక  ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అన్నట్లు

” రాజకీయాలలో ఎప్పటికప్పుడు సమీకరణలు  మారడం సహజం. అసలు రాజకీయమంటేనే అది.”

– పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

నేటినుంచే కోవిడ్ -19 బూస్టర్ డోస్

Sub Editor

గ్రామీణ ప్రాంతాలకు ఉచిత హైస్పీడ్ ఇంటర్ నెట్

Satyam NEWS

5రోజుల సీబీఐ కస్టడీకి చిదంబరం

Satyam NEWS

Leave a Comment