30.2 C
Hyderabad
October 13, 2024 16: 49 PM
Slider జాతీయం

క్లోస్డ్ లైన్:109 ఏళ్ల అత్యంత పురాతన రైల్వే లైను బంద్

up oldest railway line closed by court order

అటవీ సంరక్షణ దృష్ట్యా సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు యూపీలోని ధుధ్వా నేషనల్ పార్క్ మీదుగా వెళ్లే 109 ఏళ్ల అత్యంత పురాతన రైల్వే లైను మూతపడనుంది. నాన్‌పారా- మైలానీ మధ్య నడిచే 171 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం అడవుల మధ్య నుంచి సాగుతుంది. దీనికి ప్రత్యామ్నాయం గా లఖీంపూర్- మైలానీ బ్రాడ్ గేజ్ మార్గం ఈ నెలాఖరుకు ప్రారంభం కానుంది. తరువాత నాన్‌పారా- మైలానీ రైలు మార్గం మూతపడనుంది.

అటవీ జంతువులు, అటవీ సంరక్షణ దృష్ట్యా సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు నాన్‌పారా- మైలానీ రైలు మార్గాన్ని మూసివేయ నున్నారు. ఈ సందర్భంగా రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ తాము ధువాన్ వచ్చే ప్రయాణికుల కోసం ఒక టాయ్‌ట్రైన్ ప్రారంభిస్తామని, దానివలన అటవీ జంతువులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లదని తెలిపారు. కాగా ధుధ్వా టైగర్ రిజర్వ్‌కు చెందిన అధికారి సంజయ్ పాఠక్ మాట్లాడుతూ గత 20 ఏళ్లలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదాల్లో వందలాది జంతువులు మృతి చెందాయని అన్నారు.

Related posts

19,20 తేదీలలో అరుణోదయ ‌సాంస్కృతిక  సమాఖ్య రాష్ట్ర సభలు

Murali Krishna

ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS

డాక్టర్ మోహన్ కు జాతీయ స్థాయి ఉగాది పురస్కారం

Satyam NEWS

Leave a Comment