38.2 C
Hyderabad
May 5, 2024 19: 11 PM
Slider ముఖ్యంశాలు

అరుణాచల గిరి ప్రదర్శనకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు

#TSRTC

తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. గురు పౌర్ణమి సందర్భంగా జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని సంస్థ నిర్ణయించింది. సర్వీసు నంబర్ 98889 గల ఈ బస్సు.. జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి  బయలుదేరుతుంది.

ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత జులై 3 సాయంత్రం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్తుంది. అక్కడ దర్శనానంతరం హైదరాబాద్ కు మరుసటి రోజు జులై 4 ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది. అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా టీఎస్ఆర్టీసీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.2600గా సంస్థ నిర్ణయించింది.

‘గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదర్శనకు భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఎంబీజీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం 9959226257,9959224911 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు.’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సూచించారు. 

Related posts

మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దుర్మరణం

Satyam NEWS

ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలి

Bhavani

తెలుగుదేశం వల్లే కోడెలకు మనస్తాపం

Satyam NEWS

Leave a Comment