విద్యుత్ బకాయిలు నిక్కచ్చిగా వాసులు చేస్తున్న యూ పీ విద్యుత్ అధికారులు బీఎస్పీ అధ్యక్షురాలు, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి షాక్ ఇచ్చారు. యూపీలోని గ్రేటర్ నొయిడాలో ఉన్న మాయావతి ఇంటికి కరెంట్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. సరైన సమయానికి కరెంట్ బిల్లు రూ.67 వేలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరాను ఆపివేసినట్లు తెలిపారు.
మాయావతి కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి విద్యుత్ బిల్లులు చెల్లించడంతో కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. మాయావతి నివాసానికి కరెంట్ సరఫరా నిలిపివేత విషయంలో ఎలాంటి రాజకీయాలు ఒత్తిడులు లేవని విద్యుత్ అధికారులు వెల్లడించారు.