Slider తెలంగాణ

కేసీఆర్ కుమార్తె కవిత అలిగి అమెరికా వెళ్లిందా

kavitha pout america

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మునిసిపల్ ఎన్నికల సమయంలో కవిత కనపడక పోవడ మేమిటి? నిజామాబాద్ లోకసభ స్థానం పరిధి లో మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేదెవరు ? అంటే ఆమె అమెరికా లో ఉన్నారనే సమాధానం వినవస్తుంది.

అయితే ఆమె అమెరికా ఎందుకు వెళ్లినట్లు అనే సందేహాలు వెలువడుతున్నాయి కార్య కర్తల నుండి. ఆమె తన తండ్రి ముఖ్యమంత్రి కే సి ఆర్ పై అలిగి వెళ్లారా అన్న విషయమే ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి ఓడిపోయిన తరువాత కవిత తన నియోజవర్గంలో కాని, బయట కాని కనిపించడం తక్కువైంది.

 అయితే జనంలో ఉండాలంటే తనకూ ప్రోటోకాల్ కావాలి కదా.. ఇదే ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ముందు కవిత ఉంచితే తండ్రి నుంచి సానుకూల స్పందన రాలేదని, దీంతో కవిత తండ్రి పై గుర్రుగా ఉన్నారని అందుకే అలిగి అమెరికా వెళ్లినట్లు గుసగుసలు వెలువడుతున్నాయి.

దీనికి తోడు కేటీఆర్ కు త్వరలో పట్టాభిషేకం చేస్తారన్న వార్తలు వెలువడటంతో మరోసారి తండ్రి వద్దకు వెళ్లిన కవిత తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కోరారని, లేదంటే రాజ్యసభకు పంపాలని అడిగారని టీఆర్ఎస్ వర్గాల భోగట్టా. లేకుంటే పార్టీ పగ్గాలు తన చేతికి ఇవ్వాలని కవిత చేసిన ప్రతిపాదనలకు కేసీఆర్ నుంచి ఆశించినంత స్పందన లేకపోవడంతో తనను పట్టించుకోవడం లేదని మథనపడిపోయి తల్లిదండ్రులకు చెప్పి మరీ అమెరికా వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతోంది.

తన డిమాండ్లలో ఏదో ఒక్కటి అయినా నెరవేరిస్తేనే తాను తిరిగి హైదరాబాద్ కు వస్తానని తేల్చిచెప్పినట్టు పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానుండడంతో ఈ అంశం తమ గెలుపు అవకాశాలపై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని నిజామాబాద్ గులాబీ తమ్మళ్లు భయపడుతున్నారు.

ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పడకుండా చాకచక్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్ ను ఇంటిపోరే కుదిపేస్తోందా అని సర్వత్రా చర్చ జరుగుతోంది.

Related posts

వినతుల పరిష్కారంకు ప్రాధాన్యత

mamatha

డ్రగ్ రాకెట్: మైలవరంలో గంజాయి కలకలం

Satyam NEWS

ఎటూ తేలని చంద్రబాబు కేసు: త్రిసభ్య ధర్మాసనానికి నివేదన

Satyam NEWS

Leave a Comment