28.2 C
Hyderabad
May 17, 2024 12: 02 PM
Slider

పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!

నేరపరిశోధనపై దృష్టిసారించాల్సిన ఎపిసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో  చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయి. రాష్ట్రంలో కొందరు ఐపిఎస్ లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జెపిఎస్ (జగన్ పోలీస్ సర్వీస్)గా  రూపాంతరం చెందారు. మా కుటుంబంపై బురదజల్లేందుకు  జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్దంగా సీఐడీ డిఐజి రఘురామిరెడ్డి నేతృత్వాన అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పత్రాలను తగులబెడుతున్నారని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలవాల్సిన కొందరు ఐపిఎస్ లు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం దేశచరిత్రలో ఇదే ప్రథమం. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా? చట్టాన్ని ఉల్లంఘించి  చేసిన తప్పుకు  మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఆయన అన్నారు.

Related posts

రేప్:8ఏళ్ళ బధిర బాలికపై 30 ఏళ్ల మృగాడి లైంగికదాడి

Satyam NEWS

వైభవంగా బాజీ బాబాజీ చందనోత్సవం

Satyam NEWS

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అనునిత్యం తపన

Satyam NEWS

Leave a Comment